Tadikonda MLA Sridevi: మాదిగలకు హక్కులు ఆయన వల్లే రాలేదు.. సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే శ్రీదేవి
రాజ్యంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌పై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ వల్ల మాదిగ జాతికి హక్కులు రాలేదంటూ.. ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో..
రాజ్యంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌పై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ వల్ల మాదిగ జాతికి హక్కులు రాలేదంటూ.. ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. బాబూ జగ్జీవన్ రామ్ వల్లే మాదిగలు హక్కులు సాధించుకోగలిగారంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీదేవి. ఎమ్మార్పీఎస్ నిర్వహించిన 4వ ప్రపంచ మాదిగ దినోత్సవ సభలో పాల్గొన్న శ్రీదేవి.. ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. బాబు జగజ్జీవన్ రామ్ వల్లే మాదిగలు హక్కులు సాధించుకోగలిగారంటూ… ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల అంబేద్కర్ వాదుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
శ్రీదేవి వ్యాఖ్యలు అంబేద్కర్ ను అవమానించేలా ఉన్నాయనీ.. మాల మాదిగల మధ్య చిచ్చు రేపేలా ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు. అంబేద్కర్ కు జగజ్జీవన్ రామ్ కు మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదంటున్నారు.
అయితే, ఇదే సభలో తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు శ్రీదేవి. అంబేద్కర్ రాజ్యాంగం రచిస్తే… దాన్ని అమలుచేయడం ద్వారా బాబూ జగ్జీవన్ రాం.. మాదిగలకు హక్కులు కల్పించారని చెప్పారు.
ఇవి కూడా చదవండి: Minister Perni Nani: సీజ్ చేసిన థియేటర్స్‌ను ఓపెన్ చేసుకోవడానికి అనుమతిచ్చిన సర్కార్.. కండిషన్స్ అప్లై..
Payyavula Kesav: రాష్ట్రంలో ఆర్థిక అత్యాచారం జరుగుతోంది.. పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు!