ESIC Recruitment: ఇంటర్‌ విద్యార్హతతో ఈఎస్‌ఐలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

ESIC Recruitment: ఈఎస్‌ఐసీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 3847 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి...

ESIC Recruitment: ఇంటర్‌ విద్యార్హతతో ఈఎస్‌ఐలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Follow us

|

Updated on: Dec 31, 2021 | 12:09 PM

ESIC Recruitment: ఈఎస్‌ఐసీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 3847 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 3847 ఖాళీలకు గాను అప్పర్‌ డివిజనల్‌ క్లర్క్‌ 1726, స్టెనోగ్రాఫర్‌ 163, మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌ 1931 పోస్టులు ఉన్నాయి.

* వీటిలో తెలంగాణలో యూడీసీ 25, స్టెనో 4, ఎంటీఎస్‌ 43, ఏపీలో యూడీసీ 7, స్టెనో 2, ఎంటీఎస్‌ 26 ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు యూడీసీ పోస్టులకు డిగ్రీ పూర్తిచేసి కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. స్టెనో పోస్టులకు ఇంటర్‌ ఉత్తీర్ణులై నిమిషానికి 80 పదాలు టైప్‌ చేసే సామర్థ్యం ఉండాలి. ఎంటీఎస్‌ పోస్టులకు పదో తరగతి పాసవ్వాలి. అభ్యర్థులు 18 నుంచి 27 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* స్టెనో అభ్యర్థులను మెయిన్‌, స్కిల్‌ టెస్ట్‌, ఎంటీఎస్‌ అభ్యర్థులను ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ విధానంలో తీసుకోనున్నారు.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జనవరి 15న ప్రారంభం కానున్నాయి.

* చివరి తేదీగా ఫిబ్రవర్‌ 15ను నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Vijay Devarakonda’s Liger: ఛాయ్ వాలా టు బాక్సర్… అదిరిపోయిన విజయ్ దేవరకొండ లైగర్ గ్లిమ్ప్స్

Taxpayers: మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేస్తున్నారా..? కావాల్సిన పత్రాలు ఇవే..!

Burning Topic: జిన్నా టవర్ పై సెంట్రల్లో సడేమియా || 2022 శరణమా-మారణమా..?(వీడియో)