Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online shopping: ఖరీదైన ఐఫోన్‌ ఆర్డర్‌ చేశాడు..  వచ్చిన పార్శిల్‌ను చూసి కంగుతిన్నాడు..

ఇటీవల ఆన్‌లైన్‌ మోసాలు సర్వసాధారణమైపోయాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ఖరీదైన వస్తువుల కోసం ఆర్డర్‌ చేసినప్పుడు వాటి స్థానంలో సబ్బులు, ఇటుకలు, మరికొన్ని చోట్ల ఖాళీ బాక్స్‌లు

Online shopping: ఖరీదైన ఐఫోన్‌ ఆర్డర్‌ చేశాడు..  వచ్చిన పార్శిల్‌ను చూసి కంగుతిన్నాడు..
Follow us
Basha Shek

|

Updated on: Jan 01, 2022 | 7:35 AM

ఇటీవల ఆన్‌లైన్‌ మోసాలు సర్వసాధారణమైపోయాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ఖరీదైన వస్తువుల కోసం ఆర్డర్‌ చేసినప్పుడు వాటి స్థానంలో సబ్బులు, ఇటుకలు, మరికొన్ని చోట్ల ఖాళీ బాక్స్‌లు రావడం మనం చూస్తూనే ఉన్నాం. వీటి గురించి సదరు కంపెనీలు వివరణలు ఇస్తున్నా ఆన్‌లైన్‌ మోసాలు ఆగడం లేదు. తాజాగా యూకేకు చెందిన ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎంతో ఇష్టంగా ఐఫోన్‌ ఆర్డర్‌ చేస్తే టిష్యూ పేపర్‌లో చుట్టబడిన రెండు ఓరియో క్యాడ్‌బరీ చాక్లెట్ల పార్శిల్‌ ప్యాక్‌లో వచ్చాయి. దీంతో సదరు వినియోగదారుడు లబోదిబోమన్నాడు.

వివరాల్లోకి వెళితే.. యూకేకు చెందిన డానియెల్‌ కారోల్‌ దాదాపు రూ.1,05, 000 లక్షల విలువైన ఐఫోన్‌ 13 ప్రో మ్యాక్స్‌ను ఆర్డర్‌ చేశాడు. డిసెంబర్‌ 2న యాపిల్‌ అధికారిక వెబ్‌సైట్లో ఆర్డర్‌ చేసిన అతనికి డిసెంబర్‌ 17న డెలివరీ ​అందాల్సి ఉంది. కానీ ఆర్డర్‌ రావల్సిన తేదీకి రెండు వారాలు ఆలస్యంగా పార్శిల్‌ వచ్చింది. లేటైనా ఎలాగో వచ్చిందిలే అని ఎంతో ఉత్సుకతతో ఆ పార్శిల్‌ బాక్స్‌ను ఓపెన్‌ చేసిన డానియెల్‌ షాక్‌ తిన్నాడు. ఐఫోన్‌ లేకపోగా దాని స్థానంలో టాయిలెట్‌ టిష్యూ పేపర్‌ రోల్‌తో చుట్టిన 120 గ్రాముల రెండు ఓరియో క్యాడ్‌బరీ చాక్లెట్లు ఉన్నాయి. దీంతో తాను మోసపోయిన విషయాన్ని గ్రహించిన కారోల్‌ ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఐ ఫోన్‌ స్థానంలో తనకు వచ్చిన పార్శిల్‌ ఫొటోలను పోస్ట్‌ చేశాడు. కాగా ఈ ఘటనపై స్పందించిన డీహెచ్‌ఎల్‌ డెలివరీ సర్వీసెస్‌ దర్యాప్తు చేపట్టింది.

Also Read:

RRR-Ram Charan: రైజ్ ఆఫ్ రామ్ సాంగ్ రిలీజ్.. రామమ్ రాఘవమ్ అదిరిపోయిందిగా..

IND VS SA: భారత వన్డే జట్టు ప్రకటనపై 5 కీలక విషయాలు.. వీరికి ఛాన్స్ ఇవ్వడంపై భారీ స్కెచ్..!

Benefits Of Vitamin D: విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారా.. ఇలా బయటపడండి..!