Metro Station: అధికారుల వినూత్న ప్రయత్నం.. మెట్లే ఎక్కుతామంటున్న ప్రయాణికులు.. ఎందుకో ఓ లుక్కేయండి..!

Metro Station: కొచ్చిలో మెట్రో అధికారులు వినూత్నంగా ఆలోచించారు. జనాలు లిఫ్టును ఉపయోగించకుండా.. మెట్లు ఎక్కే ప్లాన్‌ వేశారు. వారి కొత్త ఐడియా ఫలితాలను కూడా ఇస్తోంది.

Metro Station: అధికారుల వినూత్న ప్రయత్నం.. మెట్లే ఎక్కుతామంటున్న ప్రయాణికులు.. ఎందుకో ఓ లుక్కేయండి..!
Music Stairs
Follow us

|

Updated on: Dec 31, 2021 | 8:39 PM

Metro Station: కొచ్చిలో మెట్రో అధికారులు వినూత్నంగా ఆలోచించారు. జనాలు లిఫ్టును ఉపయోగించకుండా.. మెట్లు ఎక్కే ప్లాన్‌ వేశారు. వారి కొత్త ఐడియా ఫలితాలను కూడా ఇస్తోంది. వివరాల్లోకెళితే.. మూడు, నాలుగు అంతస్తులకు మెట్లు ఎక్కాలంటే ఎవరైనా ముందే నీరసపడిపోతారు. అబ్బా లిఫ్ట్ లేదా అంటూ ఆరా తీస్తారు. గత్యంతరం లేకపోతే ఆయసపడుతూ ఎక్కుతారు. ముఖ్యంగా షాపింగ్ కాంప్లెక్సులు, సినిమా థియేటర్లు, మాల్స్, మెట్రో స్టేషన్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, కేరళ, కొచ్చిలోని ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ లో మాత్రం దీనికి విరుద్ధం. అక్కడ లిఫ్ట్ ఎక్కమన్నా ఎక్కరు. ప్రయాణీకులు ఉల్లాసంగా, ఉత్సాహంగా మెట్లు ఎక్కి దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి కారణం అక్కడి మెట్రో యాజమాన్యం తీసుకున్న ఓ వినూత్న నిర్ణయమే. ఎంజీ రోడ్డు మెట్రో స్టేషన్‌లో ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మెట్లు ఎక్కీ, దిగే సమయంలో వినసొంపైన మ్యూజిక్ వినిపిస్తుంది. మెట్లమీద వెడుతుంటే సప్తస్వరాలు పలుకుతాయి. ఒక్కో మెట్టు ఒక్కో స్వరం పలికేలా ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు ఎంజీరోడ్డు మెట్రో స్టేషన్ లోని పియానో మెట్లు ఎక్కి దిగేందుకు ప్రయాణికులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ మ్యూజికల్ స్టెప్స్ కంప్యూటర్ తో డిజైన్ చేశారు. మెట్టుమీద అడుగు వేసినప్పుడు లైటింగ్ తో పాటు స్వరం వినిపించేలా ఏర్పాటు చేశారు. ఈ మ్యూజికల్ మెట్లను ట్రాయాక్సియా ఇన్ఫోటెక్ సంస్థ ఇంజనీర్లు రూపొందించారు.

Also read:

NEET PG Counselling: మెడికోలకు గుడ్‌న్యూస్.. నీట్ పీజీ కౌన్సెలింగ్ జనవరి 6 లోపు జరుగొచ్చు..

సీరియల్‌కి అయినా ముగింపు ఉంటుందేమో గానీ.. ఆ రోడ్డుకు మాత్రం శుభం కార్డు పడేలా లేదు..!

Bheemla Nayak: 2022 కి వెల్కమ్ చెబుతూ పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్.. భీమ్లా నాయక్ డీజే సాంగ్ రిలీజ్..