Omicron: తమిళనాడును చుట్టేసిన మరో ఉపద్రవం.. నిన్న భారీ వర్షం.. నేడు ఒక్కరోజే 74 కొత్త ఒమిక్రాన్ కేసులు..
భారీ వర్షాలతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన తమిళనాడుకు మరో ఉపద్రవం ముంచుకొచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక్కరోజే 74 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో..

భారీ వర్షాలతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన తమిళనాడుకు మరో ఉపద్రవం ముంచుకొచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక్కరోజే 74 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. స్టాలిన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. శనివారం నుంచి కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు. తమిళనాడును ఒమిక్రాన్ వణికిస్తోంది. అక్కడ మొత్తం కేసుల సంఖ్య 120కి చేరింది. దీంతో.. ఒకటి నుంచి 8వ తరగతి వరకు స్కూళ్లు మూసేయాలని నిర్ణయించారు. 50 శాతం ఆక్యుపెన్సీతో మాల్స్, థియేటర్లు, మెట్రోలు నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జనవరి 30 వరకు ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించింది.
నిన్న మహారాష్ట్ర.. నేడు తమిళనాడు.. రేపు ఏ రాష్ట్రం? అందరిలోను ఇవే భయాందోళనలు. మన దేశంలోని ఒమిక్రాన్ వేరియంట్ ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా.. వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య వెయ్యి దాటేసింది. అందులో దాదాపు సగం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే రికార్డవగా.. ఇప్పుడు తమిళనాడు కూడా ఒమిక్రాన్ కాటుకు గురైంది.
ఇప్పుడు జరుగుతున్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఆందోళనల్ని రెట్టింపు చేస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఆంక్షలు అమలు చేస్తుండగా.. మాస్క్ తప్పనిసరిగా వాడాలని వైద్య నిపుణులు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి: Hyderabad Drug Racket: న్యూ ఇయర్ గ”మ్మత్తు”పై నిఘా కన్ను.. వాటిపైనే టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఫోకస్..
Good News: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. న్యూ ఇయర్ కానుకగా బ్రాండెడ్ మద్యం..