AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా నుంచి బ్రెజిల్‌ వరకు ఆంక్షల మధ్య న్యూ ఇయర్ వేడుకలు.. కొన్ని పరిమితులు మాత్రమే..

New Year Celebrations: కరోనా వైరస్ మధ్య ప్రపంచం మరోసారి కొత్త సంవత్సరాన్ని స్వాగతించబోతోంది. కొన్ని దేశాలు కొత్త సంవత్సర వేడుకలను

అమెరికా నుంచి బ్రెజిల్‌ వరకు ఆంక్షల మధ్య న్యూ ఇయర్ వేడుకలు.. కొన్ని పరిమితులు మాత్రమే..
New Year 2
uppula Raju
|

Updated on: Dec 31, 2021 | 2:36 PM

Share

New Year Celebrations: కరోనా వైరస్ మధ్య ప్రపంచం మరోసారి కొత్త సంవత్సరాన్ని స్వాగతించబోతోంది. కొన్ని దేశాలు కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి అనుమతించగా చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. 2021 సంవత్సరం చాలా హెచ్చు తగ్గులుగా ఉంది. ఈ సంవత్సరంలో చాలా దేశాలు కరోనా వైరస్ ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాయి. అలాగే COP26 సదస్సులో ప్రపంచ నాయకులు పర్యావరణానికి సంబంధించి అనేక పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు.

అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్‌లో చాలా సంఘటనలు జరిగాయి. ఒక దేశాన్ని తాలిబన్లు ఆక్రమించగా మరో దేశాన్ని సైన్యం ఆక్రమించింది. ఈ రోజు సంవత్సరంలో చివరి రోజు చాలా దేశాలు 2021కి వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి. 2022లో మంచి జరుగుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మహమ్మారి కారణంగా ఏ దేశంలో పరిస్థితి ఎలా ఉంది. కొత్త సంవత్సరాన్ని ఎలా జరుపుకుంటున్నారో తెలుసుకుందాం.

1. భారతదేశం: కరోనా వైరస్, పెరుగుతున్న ఓమిక్రాన్ కేసుల కారణంగా చాలా రాష్ట్రాలు నూతన సంవత్సర వేడుకలను నిషేధించాయి. 50 శాతం హాజరు, రాత్రి కర్ఫ్యూ, తప్పనిసరి టీకా వంటి నిబంధనలతో ఈవెంట్‌లపై ఆంక్షలు విధించాయి.

2. బ్రెజిల్‌: రియో డి జనీరో సిటీ మేయర్ ఎడ్వర్డో పేస్ మాట్లాడుతూ.. నగరంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకోనున్నారు. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కేసులు తక్కువగా ఉన్నాయి. ఆసుపత్రిలో రోగుల ప్రవేశం తక్కువగా ఉంది. టీకా రేటు ఎక్కువగా ఉంది. దీని కారణంగా నగరం కొత్త సంవత్సరాన్ని జరుపుకోగలుగుతుంది. దీని కోసం ఇక్కడ ప్రతిష్టాత్మకమైన కోపకబానా బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం 30 లక్షల మంది ఈ వేడుకలో పాల్గొంటారు. ఈసారి కూడా నిర్వహిస్తున్నారు. కోపకబానాతో పాటు నగరంలో మరో తొమ్మిది చోట్ల బాణాసంచా కాల్చనున్నారు.

3.అమెరికా: అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. దేశంలోని అనేక రాష్ట్రాలు డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్‌ల వినాశనాన్ని ఎదుర్కొంటున్నాయి. న్యూయార్క్‌లో కూడా ఇదే జరుగుతుంది. గత సంవత్సరం ఫ్రంట్‌లైన్ సిబ్బంది, వారి కుటుంబాలు మాత్రమే ఈవెంట్లకు వ్యక్తిగతంగా హాజరు కావడానికి అనుమతించారు. శుక్రవారం రాత్రి, కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి ప్రజలు టైమ్స్ స్క్వేర్‌లో గుమిగూడే అవకాశం ఉంది.

4. దక్షిణ కొరియా: దేశంలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. సంప్రదాయకంగా అర్ధరాత్రి 20 టన్నుల గంటను మోగించడం ద్వారా కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. ప్రజలు 3D అవతార్ కామెడీ షోలను చూడవచ్చు. సంగీతం వినవచ్చు ఒకరినొకరు కలుసుకోవచ్చు. సెల్ఫీలు కూడా క్లిక్ చేయవచ్చు. న్యూ ఇయర్ వేడుకల కోసం బోసింగాక్ పెవిలియన్ వద్ద హాజరయ్యేందుకు దేశంలోని 14 మంది ముఖ్య పౌరులకు మాత్రమే అనుమతి ఉంది.

5. ఆస్ట్రేలియా: కొన్ని ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ కేసుల నుంచి ఉపశమనం లభించగా మరికొన్ని ప్రాంతాల్లో కేసులు విపరీంతగా పెరుగుతున్నాయి. బ్లూస్ పాయింట్ రిజర్వ్, గిబ్బా పార్క్ పైర్మాంట్, లావెండర్ బే, అబ్జర్వేటరీ హిల్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలు ప్రజలు రాత్రి 9 గంటలకు, అర్ధరాత్రి బాణసంచా కాల్చడానికి ఉచిత టిక్కెట్లను అందిస్తున్నాయి. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ పెరిగినప్పటికీ ఇక్కడ వేడుక కొనసాగుతోంది.

6. బ్రిటన్: ఓమిక్రాన్ కారణంగా ఈ దేశంలో రికార్డ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే పరిమితి గతసారి కంటే కొంచెం తక్కువగా ఉంది. లండన్‌లో వార్షిక బాణసంచా ప్రదర్శన రద్దు చేశారు. ప్రజలు పార్టీలు లేదా ఈవెంట్‌లను ప్రైవేట్‌గా నిర్వహించవచ్చు.

Viral Video: మాకు స్వాతంత్య్రం వచ్చిందంటూ చెంగుచెంగున ఎగురుతున్న జింకలు.. నెట్టింట్లో వీడియో వైరల్..

Green Coriander Benefits: పచ్చి కొత్తిమీరను తినేవారు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే.. ఏంటంటే..

Petrol Diesel Price: 2021లో మంట పుట్టించిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. మరి న్యూ ఇయర్‌లో ఎలా ఉండబోతున్నాయి..!