Ashes Series: నాలుగో టెస్ట్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్‌.. కరోనా బారిన పడిన స్టార్‌ క్రికెటర్‌..

ఆస్ట్రేలియా వేదికగా ఇంగ్లండ్‌, ఆసీస్‌ జట్ల జరుగుతోన్న యాషెస్ సిరీస్‌లో క‌రోనా క‌ల‌వరం కొన‌సాగుతుంది. ఇప్పటికే ఇంగ్లండ్ జ‌ట్టు స్టాఫింగ్ స్టాఫ్‌లోని ఏడుగురు స‌భ్యులు మహమ్మారి బాధితుల జాబితాలో చేరగా

Ashes Series: నాలుగో టెస్ట్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్‌.. కరోనా బారిన పడిన స్టార్‌ క్రికెటర్‌..
Follow us
Basha Shek

|

Updated on: Dec 31, 2021 | 1:24 PM

ఆస్ట్రేలియా వేదికగా ఇంగ్లండ్‌, ఆసీస్‌ జట్ల జరుగుతోన్న యాషెస్ సిరీస్‌లో క‌రోనా క‌ల‌వరం కొన‌సాగుతుంది. ఇప్పటికే ఇంగ్లండ్ జ‌ట్టు స్టాఫింగ్ స్టాఫ్‌లోని ఏడుగురు స‌భ్యులు మహమ్మారి బాధితుల జాబితాలో చేరగా.. తాజాగా ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌..ఈ సిరీస్‌లో అమోఘంగా రాణిస్తోన్న ట్రావియస్‌ హెడ్‌ కరోనాకు గురయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికారికంగా వెల్లడించింది. ‘ హెడ్‌కు ఎటువంటి కరోనా లక్షణాలు లేవు. ప్రతిరోజూ టీమ్‌ సభ్యులందరికీ సాధారణంగా నిర్వహించే కరోనా నిర్ధారణ పరీక్షల్లో హెడ్‌కు పాజిటివ్‌గా తేలింది. వారం రోజుల పాటు అతను భార్యతో కలిసి మెల్‌బోర్న్‌లోనే ఐసోలేషన్‌లో ఉండనున్నాడు ‘ అని సీఏ తెలిపింది.

కాగా యాషెస్ సిరీస్‌లో ట్రావియ‌స్ హెడ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా 3-0తో సిరీస్ గెలుచుకోవడంలో అతనిదే కీల‌క పాత్ర. బ్రిస్బేన్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్ట్‌లో హెడ్ 148 బంతుల్లోనే 152 ప‌రుగులు చేశాడు. తద్వారా ఆస్ట్రేలియా సులభంగా మ్యాచ్ గెల‌వ‌డంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇక ఈ సిరీస్‌లో అత్యధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ త‌ర్వాతి స్థానం హెడ్‌ దే. ఇప్పటివరకు సిరీస్‌లో అతను ఒక సెంచ‌రీ, ఒక హాఫ్ సెంచ‌రీతో మొత్తం 248 ప‌రుగులు చేశాడు. కాగా జ‌న‌వరి 5 నుంచి సిడ్నీ వేదిక‌గా జ‌రిగే నాలుగో టెస్టు మ్యాచ్‌కు హెడ్ దూరం కానున్నాడు. అతని స్థానంలో మిచెల్ మార్ష్, నిక్ మాడిన్సన్, జోష్ ఇంగ్లిస్‌లను ఆస్ట్రేలియా జ‌ట్టులో చేరనున్నారు.

Also Read:

Viral news: ఉడుత సైకోగా మారితే ఎలా ఉంటదో తెలుసా.. అది ఏం చేసిందో మీరు అసలు ఊహించలేరు..

Sabarimala: మళ్లీ తెరచుకున్న శబరిమల ఆలయం.. భక్తులకు ఈ షరతులు వర్తిస్తాయి..

Visakhapatnam: న్యూ ఇయర్ వేడుకల వేళ విశాఖలో అమలుకానున్న ఆంక్షలివే..