Sabarimala: మళ్లీ తెరచుకున్న శబరిమల ఆలయం.. భక్తులకు ఈ షరతులు వర్తిస్తాయి..

కేరళ శబరిమలలోని అయ్యప్ప ఆలయం తిరిగి తెరుచుకుంది. నేటి ఉదయం 5 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.

Sabarimala: మళ్లీ తెరచుకున్న శబరిమల ఆలయం.. భక్తులకు ఈ షరతులు వర్తిస్తాయి..
Sabarimala
Follow us
Basha Shek

|

Updated on: Dec 31, 2021 | 11:53 AM

కేరళ శబరిమలలోని అయ్యప్ప ఆలయం తిరిగి తెరుచుకుంది. నేటి ఉదయం 5 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. మకర జ్యోతి దర్శనం జనవరి 14న ఉంటుంది. ఈ నెల 19 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు ఆలయాన్ని తెరిచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఆ తర్వాత ఆలయం మూసేసి సాయంత్రం 5 గంటలకు తెరుస్తారు. మళ్లీ రాత్రి 10 గంటలకు దేవస్థానాన్ని మూసివేస్తారు. ఈ మేరకు అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం (ఏబీఏఎస్‌ఎస్‌) ప్రతినిధి అరుణ్‌ గురుస్వామి ఒక ప్రకటన విడుదల చేశారు. మండలకాల ఉత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం దేవస్థానం తిరిగి తెరచుకుందని, జనవరి 19 వరకు భక్తులను దర్శనానికి అనుమతినిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

నిబంధనలు ఇవే..

‘ అయ్యప్ప భక్తుల కోసందేవస్థానం బోర్డు రెండేళ్ల తర్వాత పెద్దపాదం మార్గాన్ని తెరిచింది. జనవరి 1 నుంచి భక్తులను ఈ మార్గంలో అనుమతిస్తారు. ఎరుమేలి నుంచి ప్రతిరోజూ ఉదయం 5.30- రాత్రి 10.30 మధ్య ఈ మార్గంలో ప్రయాణించవచ్చు. ఇందుకోసం భక్తులు నీలక్కల్‌, ఎరుమేలి వద్ద స్పాట్‌బుకింగ్‌ చేసుకోవచ్చు. అదేవిధంగా దర్శనం స్లాట్‌ నిర్ధారణ టికెట్‌తో పాటు రెండు డోసుల టీకా ధ్రువీకరణ లేదా ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిజల్ట్ సర్టిఫికెట్లు వెంట తీసుకెళ్లాలి. కాగా భక్తుల కోసం ఎరుమేలి, అలుద, కరిమల, పెరియనపట్టం, పంబ తదితర ప్రాంతాల్లో ఏబీఏఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో సమాచార కేంద్రాలతో పాటు అన్నదాన కేంద్రాలను ఏర్పాటుచేశాం. భక్తులు వీటిని సద్వినియోగం చేసుకోవచ్చు. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఇక మకరవిలుక్కు ఉత్సవ సమయంలో భక్తులు దర్శనానంతరం శబరిమలలో ఎక్కువ సేపు బస చేయకూడదు. వెంటనే పంబకు తిరిగి వచ్చేయాలి’ అని అరుణ్‌ గురుస్వామి సూచించారు.

Also Read:

Ratan Tata Birthday: ఒక చిన్న కప్‌ కేక్‌.. రెండు క్యాండిల్స్.. నెట్టింట్లో వైరలవుతోన్న రతన్‌ టాటా బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వీడియో..

Anandayya Medicine: హైకోర్టు మెట్లెక్కిన నెల్లూరు ఆనందయ్య.. మందు పంపిణీలో పోలీసుల జోక్యాన్ని నివారించాలంటూ పిటిషన్‌.. నేడు విచారణ..

Visakhapatnam: అక్రమ నిర్మాణాలపై ఎందుకింత అలక్ష్యం?.. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వండి.. విశాఖ కలెక్టర్‌ను ఆదేశించిన హైకోర్టు..