AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ratan Tata Birthday: ఒక చిన్న కప్‌ కేక్‌.. రెండు క్యాండిల్స్.. నెట్టింట్లో వైరలవుతోన్న రతన్‌ టాటా బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వీడియో..

సాధారణంగా సంపన్నుల ఇంట్లో వేడుకలు, పండగలంటే సంబరాలు అంబరాన్నంటుతాయి. చిన్న వేడుకైనా సన్నిహితులు, స్నేహితులను పిలిపించి గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటారు.

Ratan Tata Birthday: ఒక చిన్న కప్‌ కేక్‌.. రెండు క్యాండిల్స్.. నెట్టింట్లో వైరలవుతోన్న రతన్‌ టాటా బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వీడియో..
Ratan Tata
Basha Shek
|

Updated on: Dec 31, 2021 | 10:57 AM

Share

సాధారణంగా సంపన్నుల ఇంట్లో వేడుకలు, పండగలంటే సంబరాలు అంబరాన్నంటుతాయి. చిన్న వేడుకైనా సన్నిహితులు, స్నేహితులను పిలిపించి గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఇక పుట్టిన రోజంటే భారీ కేకులు, క్యాండిల్‌ లైటింగ్‌ డెకరేషన్లు కచ్చితంగా ఉండాల్సిందే. అయితే నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనమైన రతన్‌టాటా ఎంతో సింప్లీసిటీగా తన జన్మదిన వేడుకలను జరుపుకొన్నారు. డిసెంబర్‌ 28న 84వ వసంతంలోకి అడుగుపెట్టిన ఆయన ఒక చిన్న కప్‌ కేక్‌..రెండు క్యాండిల్స్‌తోనే తన బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకున్నారు. రతన్‌ అసిస్టెంట్‌ శాంతను నాయుడు మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొనడం గమనార్హం. శాంతను బర్త్‌డే విషెస్‌ చెబుతుంటే.. కప్‌ కేక్‌పై ఉన్న క్యాండిల్‌ను ఊది అనంతరం కేక్‌ను కట్‌ చేశారు టాటా. కాగా రతన్‌ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

మొదట వైభవ్‌ భోయిర్‌ అనే వ్యక్తి లింక్డ్‌ఇన్‌లో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. ఆతర్వాత ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయగా ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఈక్రమంలో రతన్‌ నిరాడంబరతపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించి బిలియనీర్‌గా ఎదిగిన ఆయన సింప్లిసిటీని చూసి నెటిజన్లు ముగ్ధులవుతున్నారు. టాటా ఎంతో మందికి ఆదర్శప్రాయుడని, ఆయన మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా ఈ వీడియోను ఇప్పటికే 3.9 లక్షల మందికి పైగా వీక్షించడం విశేషం.

Also read:

Visakhapatnam: అక్రమ నిర్మాణాలపై ఎందుకింత అలక్ష్యం?.. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వండి.. విశాఖ కలెక్టర్‌ను ఆదేశించిన హైకోర్టు..

Anandayya Medicine: హైకోర్టు మెట్లెక్కిన నెల్లూరు ఆనందయ్య.. మందు పంపిణీలో పోలీసుల జోక్యాన్ని నివారించాలంటూ పిటిషన్‌.. నేడు విచారణ..

Visakhapatnam: అక్రమ నిర్మాణాలపై ఎందుకింత అలక్ష్యం?.. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వండి.. విశాఖ కలెక్టర్‌ను ఆదేశించిన హైకోర్టు..