Viral: నదిలో బాంబులు పేల్చుతున్న యువకులు.. ఎందుకో తెలిస్తే షాక్ తింటారు
తమిళనాడులోని ఓ నదిలో బాంబులు పేల్చుతున్నారు కొందరు యువకులు. నదిలో బాంబులు పేల్చడం ఎందుకు..? అసలు నీటిలో మునిగాక బాంబులు ఎలా పేలుతున్నాయ్..?
తమిళనాడులోని ఓ నదిలో బాంబులు పేల్చుతున్నారు కొందరు యువకులు. నదిలో బాంబులు పేల్చడం ఎందుకు..? అసలు నీటిలో మునిగాక బాంబులు ఎలా పేలుతున్నాయ్ లాంటి డౌట్స్ మీకు రావొచ్చు. చేపలు పట్టేందుకు ఈ పనికి వారు పూనుకున్నారు. క్రిష్ణగిరి జిల్లా వేపనహళ్లిలో ఈ ఘటన జరిగింది. థెన్ పెన్నై నదిలో చేపల వేటకు యువకులు బాంబులను వాడుతున్నారు. నదిలో బాంబులను పేల్చి చేపలు పట్టడంపై గ్రామస్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నది నీరు కలుషితం అవ్వడమే కాకుండా, మత్య సంపద నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా చేపల వేటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు., పరారీలో ఉన్న యువకుల కోసం గాలింపు జరుపుతున్నారు.
కాగా నదిలో వేట కోసం ప్రత్యేకమైన బాంబులు వినియోగిస్తున్నారు. ఒడ్డున ఉండి వత్తి వెలిగించి నీటిలోకి బాంబులను విసిరేస్తున్నారు. అప్పటికే వత్తి చాలావరకు కాలిపోవడంతో బాంబు నీటిలో పడగానే పేలుతుంది. అనంతరం యువకులు నీటిలో ఈదుతూ వెళ్లి.. బాంబు పేలుడు ధాటికి చనిపోయిన చేపలను ఒడ్డుపైకి విసురుతున్నారు.
Also Read: కొత్తగా వాహనాలు కొన్నవారికి ఊరటనిచ్చే న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
Telugu Heroine: బుర్ఖాలో థియేటర్‌కి వెళ్లి సినిమా చూసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తించారా..?