AP Government: కొత్తగా వాహనాలు కొన్నవారికి ఊరటనిచ్చే న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

 ఏపీలో వాహనదారుఅలకు అలెర్ట్. రవాణా శాఖలో సర్వర్లు నిలిచిపోయాయి.  సేవలు తాత్కాలికంగా స్తంభించాయి.

AP Government: కొత్తగా వాహనాలు కొన్నవారికి ఊరటనిచ్చే న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
Ap Govt
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 31, 2021 | 8:15 AM

ఏపీలో వాహనదారుఅలకు అలెర్ట్. రవాణా శాఖలో సర్వర్లు నిలిచిపోయాయి.  సేవలు తాత్కాలికంగా స్తంభించాయి. పునరుద్దరణకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రవాణాశాఖ మంత్రి పేర్నినాని కీలక ప్రకటన చేశారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం వల్ల ప్రజలు, వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. వాహనదారులు ఇప్పుడు కొనుగోలు చేసిన వాహనాలకు జనవరి 1 తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నా.. ప్రస్తుత టాక్సులనే చెల్లించేలా అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. దీనికోసం జనవరి 1కి ముందు వాహనం కొనుగోలు చేసినట్టు తగిన డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుందన్నారు. ఈ ఆదేశాన్ని ఇప్పటికే వివిధ జిల్లాల రవాణాశాఖ అధికారులు, డీలర్లకు తెలిజేసినట్టు మంత్రి వివరించారు. వాహనదారులు ఆందోళన చెందవద్దని కోరారు.

రవాణాశాఖ వెబ్‌సైట్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా షోరూంలలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో కొత్త వెహికల్స్ కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జనవరి 1 నుంచి రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ల ఛార్జస్ పెరగనున్నాయి. ఈనేపథ్యంలో.. అంతకు ముందే వాహనాలు కొనేందుకు వాహనదారులు ఆసక్తి చూపారు. వెహికల్ డెలివరీ చేయకపోవడంతో పలు చోట్ల వినియోగదారులు డీలర్లతో వాగ్వాదానికి దిగారు. దీనిపై స్పందించిన రవాణాశాఖ మంత్రి పేర్ని నాని… వాహనదారులు ఆందోళన చెందవద్దని.. మరో ఛాన్స్ కల్పిస్తామని చెప్పారు. వెహికల్స్ రిజిస్ట్రేషన్లు కోసం వాహనదారులు భారీగా రావడంతో వెబ్​సైట్​పై ఒత్తిడి ఏర్పడి సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.

Also Read: Telangana: రోడ్డుపై కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్ల కట్టలు.. ఆ జిల్లాలో కలకలం.. ఆరా తీయగా

Telugu Heroine: బుర్ఖాలో థియేటర్‌కి వెళ్లి సినిమా చూసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తించారా..?