AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రోడ్డుపై కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్ల కట్టలు.. ఆ జిల్లాలో కలకలం.. ఆరా తీయగా

అక్కడ రోడ్డుపై వెళ్తున్న వాహనదారుల కళ్లు చెదిరిపోయాయి. వారికి కనిపించిన సీన్ చూసి కంగుతిన్నారు. దూరం నుంచి కరెన్సీ నోట్ల కుప్పను చూసి షాకయ్యారు.

Telangana: రోడ్డుపై కుప్పలు తెప్పలుగా  కరెన్సీ  నోట్ల కట్టలు.. ఆ జిల్లాలో కలకలం.. ఆరా తీయగా
Currency Scrap
Ram Naramaneni
|

Updated on: Dec 30, 2021 | 11:17 AM

Share

అక్కడ రోడ్డుపై వెళ్తున్న వాహనదారుల కళ్లు చెదిరిపోయాయి. వారికి కనిపించిన సీన్ చూసి కంగుతిన్నారు. దూరం నుంచి కరెన్సీ నోట్ల కుప్పను చూసి షాకయ్యారు. దగ్గరికి వెళ్లి చూస్తే.. అసలు విషయం బోధపడింది. అది కరెన్సీ నోట్ల తుక్కు. నిజామాబాద్‌ జిల్లాలో ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. మెండోరా మండలం బుస్సాపూర్‌ వద్ద హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ నేషనల్ హైవేపై బుధవారం చిరిగిన కరెన్సీ (నోట్ల తుక్కు) కుప్పలుకుప్పలుగా కనిపించింది.  లారీ నుంచి కింద పడిన సంచి పైనుంచి వాహనాలు వెళ్లడంతో.. కరెన్సీ తుక్కు రోడ్డుపై చెల్లాచెదురుగా పడినట్టు స్థానికులు చెబుతున్నారు.  గాలికి ఆ కరెన్సీ నోట్ల ముక్కలు చుట్టుపక్కల ప్రాంతాలకు కొట్టుకుపోవడంతో కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాక జనాలు అయోమయంలో ఉండిపోయారు. స్థానికుల సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు స్పాట్‌కు చేరుకుని కరెన్సీ నోట్ల తుక్కును స్వాధీనం చేసుకున్నారు.

అవి అసలైనవా? నకిలీ నోట్లా?.. ఎక్కడికి తరలిస్తున్నారు?.. అసలు తుక్కుగా ఎందుకు మార్చారు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అటుగా లోడ్‌తో వెళ్లిన వాహనాల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.  ఆర్‌బీఐ పాత నోట్లను ధ్వంసం చేసే క్రమంలో రహస్య ప్రదేశంలో కాల్చేస్తుంది తప్ప ఇలా తరలించదని అధికారులు చెబతున్నారు. అది బ్లాక్ మనీ లేదా నకిలీ నోట్లో అయ్యే అవకాశం ఉందని.. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని పోలీసులు స్పష్టం చేశారు.

Also Read: ఈ ఫోటోలోని ఈ చిన్నారి.. ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్.. స్టార్ హీరో వైఫ్ కూడా.. గుర్తుపట్టారా..?

టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..