Pradeep Machiraju: అందుకే.. మీకు ఫ్యాన్‌ అయ్యామంటూ యాంకర్‌ ప్రదీప్‌పై నెటిజన్ల ప్రశంసల వర్షం.. కారణమేంటంటే..

ప్రదీప్‌ మాచిరాజు.. యాంకర్‌గా, నటుడిగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై రాణిస్తున్న ఇతని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

Pradeep Machiraju: అందుకే.. మీకు ఫ్యాన్‌ అయ్యామంటూ యాంకర్‌ ప్రదీప్‌పై నెటిజన్ల ప్రశంసల వర్షం.. కారణమేంటంటే..
Follow us
Basha Shek

|

Updated on: Dec 31, 2021 | 8:51 AM

ప్రదీప్‌ మాచిరాజు.. యాంకర్‌గా, నటుడిగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై రాణిస్తున్న ఇతని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవలే ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అంటూ హీరోగా తన అదృష్టం పరీక్షించుకున్నాడు. ప్రస్తుతం పలు టీవీ షోలు, కార్యక్రమాలతో బిజీగా ఉన్న ప్రదీప్‌ మాచిరాజు తాజాగా తన మంచి మనసును చాటుకున్నాడు. ‘కష్టాల్లో ఉన్నాం..సాయం చేయండి’ అని సోషల్‌ మీడియాలో అభ్యర్థించిన ఓ విద్యార్థికి అండగా నిలబడ్డాడు. తన చేతనైన సహాయం చేస్తానని అతనికి భరోసా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రదీప్‌ ఉదారతను చూసి అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ అసలు విషయమేమిటంటే.. ఇటీవల ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆర్థిక సాయం కోరుతూ ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టాడు. ‘మా కుటుంబం దీన స్థితిలో ఉంది. ఇటీవల మా నాన్న కరోనా కారణంగా కన్నుమూశారు. దీంతో మేం ఆర్థికంగా కుంగిపోయాం. బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్న నేను..ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న మా సోదరి చాలా కష్టాల్లో ఉన్నాం. దయచేసి మాకు కొంత డబ్బు సాయం చేయండి. మా కుటుంబ దీన పరిస్థితి గురించి మీకు తెలియలాంటే ప్రూఫ్‌ కూడా చూపిస్తాను’ అంటూ తన ఫోన్‌ నంబర్‌తో పాటు ప్రదీప్‌ను ట్యాగ్‌ చేశాడు.

అందుకే మీకు ఫ్యాన్‌గా మారాను.. దీనికి స్పందించిన ప్రదీప్‌ ‘తప్పకుండా బ్రదర్‌. నాకు చేతనైనా సాయం చేస్తాను. మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. మీ వివరాలను నాకు పంపించండి’ అంటూ విద్యార్థికి భరోసా ఇచ్చాడు. ఇలా ఎంతో మంచి మనసుతో ప్రదీప్‌ స్పందించిన తీరుపై అభిమానులు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు . ‘అందుకే నేను మీకు నేను అభిమాని అయ్యాను.. మీరు చాలా గ్రేట్‌’ అంటూ ప్రదీప్‌ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తున్నారు. కాగా గతంలో కూడా ఎన్నోసార్లు తన సేవాభావాన్ని చాటుకున్నాడు ప్రదీప్‌. అవసరమైనవారికి ఆర్థిక సాయం చేసి ఆదుకున్నాడు. ఇక కరోనా సమయంలో తన చేతనైనా సాయం చేసి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు.

Also Read:

Viral Video: నీదేం టేస్టురా బాబూ.. మ్యాగీపై మండిపడుతున్న ఆహార ప్రియులు.. కారణమేంటంటే..

Year Ender 2021: కరోనా కాలంలో కొరియన్‌ వంటకాలకు పెరిగిన క్రేజ్‌.. ఈ ఏడాది భారతీయులు ఎక్కువగా ఆర్డర్‌ చేసిన ఆహార పదార్థాలేంటంటే..

Coronavirus: బాలీవుడ్‌లో ఆగని కరోనా ప్రకంపనలు.. వైరస్‌ బారిన పడిన బాహుబలి ‘మనోహరి’..