AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నీదేం టేస్టురా బాబూ.. మ్యాగీపై మండిపడుతున్న ఆహార ప్రియులు.. కారణమేంటంటే..

మ్యాగీ.. నిమిషాల్లో తయారయ్యే ఈ వంటకాన్ని చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌గా, స్నాక్స్‌గా ఎక్కువగా తీసుకుంటుంటారు. స్ట్రీట్ ఫుడ్ లో కూడా మ్యాగీకి ప్రత్యేక స్థానముంది. ఈక్రమంలోనే చాలామంది మ్యాగీతో రకరకాల ప్రయోగాలను చేస్తూ ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఇందులో కొన్ని

Viral Video: నీదేం టేస్టురా బాబూ.. మ్యాగీపై మండిపడుతున్న ఆహార ప్రియులు.. కారణమేంటంటే..
Basha Shek
|

Updated on: Dec 31, 2021 | 7:53 AM

Share

మ్యాగీ.. నిమిషాల్లో తయారయ్యే ఈ వంటకాన్ని చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌గా, స్నాక్స్‌గా ఎక్కువగా తీసుకుంటుంటారు. స్ట్రీట్ ఫుడ్ లో కూడా మ్యాగీకి ప్రత్యేక స్థానముంది. ఈక్రమంలోనే చాలామంది మ్యాగీతో రకరకాల ప్రయోగాలను చేస్తూ ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఇందులో కొన్ని ఆకట్టుకుంటుంటే..మరికొన్ని బెడిసికొడుతున్నాయి. కాగా కొన్ని రోజుల క్రితం ‘మ్యాగీ షర్‌బత్‌’ అంటూ ఓ వ్యాపారి నెటిజన్లకు చికాకు తెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా అలా తయారైన తందూరీ మ్యాగీపై కూడా నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ‘నీదేం టేస్టురా బాబూ’ అంటూ ఈసడించుకుంటున్నారు. కాగా దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా ఇటీవల కొంతమంది విభన్న రోజులంటూ తినే ఆహార పదార్థాలపై వివిధ రకాల ప్రయోగాలు చేస్తున్నారు. వివిధ రకాల కాంబినేషన్లతో కలిపి వంటకాలను తయారుచేస్తున్నారు. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. తాజాగా అనికైత్ లూత్రా అనే సోషల్‌ మీడియా యూజర్‌ ‘తందూరీ మ్యాగీ’ తయారుచేసి యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశాడు. ఇందులో భాగంగా మట్టి పాత్రను కొలిమిలో కాల్చి అందులో నుంచి ఓ పాత్రను పైకి తీసి గిన్నెలో పెట్టారు. అది మండుతూ ఎర్రగా ఉంది. అప్పుడు దానికి కొద్దిగా వెన్నను అంటించారు. వెంటనే అది కొవ్వొత్తిలా కాలి నిప్పులు చిమ్మింది. అప్పుడు కాస్తా ఉడికించిన మ్యాగీని అందులో పోశారు. దీంతో మ్యాగీ కుతకుతా ఉడుకుతుంది. అంతే తందూరీ మ్యాగీ తయారీ పూర్తవుతుంది. ఇప్పటివరకు 34 లక్షల మందికి పైగా ఈ వీడియోను చూశారు. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘రెస్ట్‌ ఇన్‌ పీస్‌.. మ్యాగీ ఆత్మ శాంతించాలి’, ‘మ్యాగీ డ్యాన్స్‌ చేస్తోంది… రుచికరమైన వంటకాన్ని ప్రయోగం పేరుతో చెడగొట్టారు’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మరి నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ తందూరీ మ్యాగీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:

Coronavirus: బాలీవుడ్‌లో ఆగని కరోనా ప్రకంపనలు.. వైరస్‌ బారిన పడిన బాహుబలి ‘మనోహరి’..

Year Ender 2021: కరోనా కాలంలో కొరియన్‌ వంటకాలకు పెరిగిన క్రేజ్‌.. ఈ ఏడాది భారతీయులు ఎక్కువగా ఆర్డర్‌ చేసిన ఆహార పదార్థాలేంటంటే..

Prabhas: డార్లింగ్‌ మనసు బంగారం.. రాధేశ్యామ్‌ ప్రీరిలీజ్‌లో గాయ పడిన అభిమానుల కోసం..

భారీ బాంబు పేలుడు.. ఏడుగురు మృతి.. 13 మందికిపైగా గాయాలు!
భారీ బాంబు పేలుడు.. ఏడుగురు మృతి.. 13 మందికిపైగా గాయాలు!
సంక్రాంతికి ఇంటికొచ్చి.. ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆడుతూ
సంక్రాంతికి ఇంటికొచ్చి.. ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆడుతూ
పచ్చని కాపురంలో ఫోన్‌ చిచ్చు.. భర్తకు తెలియకుండా భార్య ఏం చేసిందో
పచ్చని కాపురంలో ఫోన్‌ చిచ్చు.. భర్తకు తెలియకుండా భార్య ఏం చేసిందో
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి