AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anandayya Medicine: హైకోర్టు మెట్లెక్కిన నెల్లూరు ఆనందయ్య.. మందు పంపిణీలో పోలీసుల జోక్యాన్ని నివారించాలంటూ పిటిషన్‌.. నేడు విచారణ..

కరోనా సమయంలో ఆయుర్వేద మందుతో వార్తల్లో నిలిచిన నెల్లూరు ఆనందయ్య.. ఒమిక్రాన్‌కు కూడా మందు తయారు చేశానని ప్రకటించారు. దీంతో.. ఆయన నివాసముండే కృష్ణపట్నానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు.

Anandayya Medicine: హైకోర్టు మెట్లెక్కిన నెల్లూరు ఆనందయ్య.. మందు పంపిణీలో పోలీసుల జోక్యాన్ని నివారించాలంటూ పిటిషన్‌.. నేడు విచారణ..
Anandayya
Basha Shek
|

Updated on: Dec 31, 2021 | 10:22 AM

Share

కరోనా సమయంలో ఆయుర్వేద మందుతో వార్తల్లో నిలిచిన నెల్లూరు ఆనందయ్య.. ఒమిక్రాన్‌కు కూడా మందు తయారు చేశానని ప్రకటించారు. దీంతో.. ఆయన నివాసముండే కృష్ణపట్నానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు. అయితే ఆనందయ్యకు ఊహించని షాక్‌లు తగిలాయి. ఓ వైపు ఆనందయ్య మందు పంపిణీతో కరోనా వ్యాప్తి చెందే ప్రమాదముందని, మందు పంపిణీకి అనుమతి ఇవ్వొద్దంటూ కృష్ణపట్నం పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మరోవైపు మందుకు ఉన్న అనుమతి ఏంటి? పంపిణీకి ఎవరు అనుమతులిచ్చారో చెప్పాలంటూ నెల్లూరు జిల్లా వైద్యాధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు ఆనందయ్య. మందు పంపిణీలో పోలీసుల జోక్యాన్ని అడ్డుకోవాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఆయుర్వేద మందు కోసం తన దగ్గరకు వస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని, దీనిని నివారించాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

కాగా ఆనందయ్య పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టనుంది. జస్టిస్ డి రమేష్ ముందు దీనిపై వాదనలు విననున్నారు. కాగా గతంలోనూ హైకోర్టు సహాయంతో కరోనా మందు పంపిణీకి అనుమతి పొందారు ఆనందయ్య. ఈ సంగతి పక్కన పెడితే ఒమిక్రాన్‌ నివారణకు ఆయన తయారుచేసిన మందుపై రగడ కొనసాగుతూనే ఉంది. ఓ వైపు ఆ ఔషధానికి అనుమతులు లేవని ఆయుష్‌ చెబుతుంటే.. ఊళ్లో మందు పంపిణీ చేయొద్దంటూ కృష్ణపట్నం వాసులు ఆందోళనకు దిగారు. పంపిణీకి వ్యతిరేకంగా ఏకంగా పంచాయతీ తీర్మాణం చేపట్టారు. అంతకుముందు ఆనందయ్య ఇంటి ఎదుట గ్రామస్థులు ధర్నాకు దిగారు.

Also Read:

Pradeep Machiraju: అందుకే.. మీకు ఫ్యాన్‌ అయ్యామంటూ యాంకర్‌ ప్రదీప్‌పై నెటిజన్ల ప్రశంసల వర్షం.. కారణమేంటంటే..

Visakhapatnam: అక్రమ నిర్మాణాలపై ఎందుకింత అలక్ష్యం?.. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వండి.. విశాఖ కలెక్టర్‌ను ఆదేశించిన హైకోర్టు..

Viral Video: నీదేం టేస్టురా బాబూ.. మ్యాగీపై మండిపడుతున్న ఆహార ప్రియులు.. కారణమేంటంటే..

చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?