AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: శంఖం ఇంట్లో ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.. సంతోషంగా ఉండాలంటే ఇవి తెలుసుకోవాల్సిందే..

Astro Tips: చాలా మంది ఇళ్లలో దేవుడి మందిరంలో శంఖాన్ని ఉంచడం గమనించే ఉంటారు. శంఖం ఇంట్లో ఉంటే శుభం జరుగుతుందని విశ్వాసం. హిందూ మతంలో శంఖానికి..

Astro Tips: శంఖం ఇంట్లో ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.. సంతోషంగా ఉండాలంటే ఇవి తెలుసుకోవాల్సిందే..
Shiva Prajapati
|

Updated on: Dec 31, 2021 | 3:20 PM

Share

Astro Tips: చాలా మంది ఇళ్లలో దేవుడి మందిరంలో శంఖాన్ని ఉంచడం గమనించే ఉంటారు. శంఖం ఇంట్లో ఉంటే శుభం జరుగుతుందని విశ్వాసం. హిందూ మతంలో శంఖానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శుభకార్యాల సమయంలో, పూజలు చేసే సమయంలో శంఖం ఊదుతుంటారు. అంతేకాదు.. వాస్తు దోషాలను తొలగించడంలోనూ శంఖం ఉపకరిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సనాతన సంప్రదాయంలో శంఖం చాలా పవిత్రమైనదిగా పేర్కొనడం జరిగింది. శంఖం.. సముద్రం మథనం ద్వారా వచ్చిన 14 విలువైన రత్నాల నుండి ఉద్భవించిందని చెబుతుంటారు. శంఖం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కూడా ఇంట్లోనే ఉంటుందని విశ్వసిస్తారు. ఇవాళ మనం శంఖం ప్రాముఖ్యత, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శంఖాన్ని పూజించడం ద్వారా కలిగే ప్రయోజనాలు.. తీర్థయాత్రలను సందర్శించడం ద్వారా లభించే పుణ్య ఫలాలు ఇంట్లో శంఖాన్ని ఉంచి దర్శనం చేసుకోవడం ద్వారా లభిస్తాయని అనాధిగా విశ్వాసం. హిందూ మత సాంప్రదాయం ప్రకారం దేవుళ్లను మాత్రమే కాకుండా.. శంఖాన్ని కూడా పూజిస్తారు. శంఖం పాపాలను నాశనం చేసేది, దీర్ఘాయువు ఇచ్చేది, శత్రువులపై విజయాన్ని అందించేదిగా అదర్వణవేదంలో పేర్కొనడం జరిగింది.

శంఖం ప్రాముఖ్యత, ప్రయోజనాలు.. 1. రోజూ శంఖం వాయించడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. శంఖం ఊదడం వల్ల ఊపిరితిత్తులు దృఢంగా మారతాయి. శ్వాస సమస్యలు తొలగిపోతాయి. మనపై ఉండే ప్రతికూల శక్తులు విఫలమవుతాయి. 2. శంఖంలో నీటిని ఉంచి పూజలు చేసి.. ఆ నీటిని ఇంట్లో చల్లం ద్వారా ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మన చుట్టూ ఉండే వాతావరణ స్వచ్ఛంగా మారుతుంది. 3. వాస్తు శాస్త్రంలో శంఖానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇంటి బలహీనమైన దిశలో శంఖాన్ని ఉంచడం వల్ల విజయం, కీర్తి, పురోగతి లభిస్తుంది. 4. ఇంటికి ఈశాన్య దిశలో శంఖాన్ని ఉంచడం వల్ల విద్యలో విజయం లభిస్తుంది. పూజా స్థలంలో లేదా గదిలో శంఖాన్ని ఉంచడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. 5. శంఖంలో ఉంచిన నీరు చెడిపోదని విశ్వసిస్తారు. శంఖంలో కాల్షియం, ఫాస్పరస్, సల్ఫర్ లక్షణాలు ఉన్నాయి. దీనిలో ఉంచిన నీటిని తాగడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. 6. శంఖం ఉంచిన ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని కూడా జనాలు విశ్వసిస్తారు. లక్ష్మీ దేవి విగ్రహం, చిత్రం పటం దగ్గర శంఖాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శోభ పరిఢవిల్లుతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జ్యోతిష్య శాస్త్రంలో శంఖం.. బుధ గ్రహానికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. శంఖం ఊదడం వల్ల ఆనందం, అదృష్టం, శ్రేయస్సు లభిస్తుంది. ఉదయం, సాయంత్రం శంఖం ఊదడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ప్రేతాత్మలకు సంబంధించిన అడ్డంకులు, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అందులో నీటిని నింపి ఇంట్లో చల్లడం వల్ల ఇల్లు స్వచ్ఛంగా ఉంటుంది. పూజా స్థలంలో శంఖాన్ని ఎప్పుడూ నీటితో నింపాలి. శంఖం అదృష్టానికి చిహ్నమే కాదు ఆరోగ్యానికి కూడా కారకం.

Also read:

Petrol Diesel Price: 2021లో మంట పుట్టించిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. మరి న్యూ ఇయర్‌లో ఎలా ఉండబోతున్నాయి..!

UP Tax Raids: యూపీలో అవినీతి సువాసనలు.. దాడుల్లో కట్టలకు కట్టల కరెన్సీ నోట్లు

Viral: ఈ మేక ఫ్యూర్ నాన్-వెజ్.. చికెన్ బిర్యానీ లేకపోతే పస్తులైనా ఉంటుంది