Viral: ఈ మేక ఫ్యూర్ నాన్-వెజ్.. చికెన్ బిర్యానీ లేకపోతే పస్తులైనా ఉంటుంది
ఇటీవల పుష్ప సినిమా కోసం ‘దాక్కో దాక్కో మేక’ అనే సాంగ్‌ను ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ రాసిన సంగతి తెలిసిందే. 'వెలుతురు తింటది ఆకు.. ఆకును తింటది మేక'.. అందులో ఆయన పేర్కొన్నారు.
ఇటీవల పుష్ప సినిమా కోసం ‘దాక్కో దాక్కో మేక’ అనే సాంగ్‌ను ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ రాసిన సంగతి తెలిసిందే. ‘వెలుతురు తింటది ఆకు.. ఆకును తింటది మేక’.. అని పాటలో ఆయన జీవిత సత్యాన్ని పేర్కొన్నారు ఆయన. మాములుగా మేకలు, గొర్రెలు కేవలం ఆకులు, అలమలు మాత్రమే తింటాయి. అవి ఫ్యూర్ వెజ్ అనమాట. అయితే పైన ఫోటోలో ఉన్న మేక మాత్రం ఇందుకు పూర్తి డిఫరెంట్. చికెన్ బిర్యానీ లేకపోతే ఇది అసలు ఎంగిలిపడదు. ఏ రోజు అయినా బిర్యానీ పెట్టకపోతే పస్తులైనా ఉంటుంది కానీ.. ఆకులు మాత్రం తినదు. ఈ మేక మధ్యప్రదేశ్‌లోని దేవాస్ పట్టణ సమీపాన లోహారి గ్రామంలో ఉంది. రైతు రఫీఖ్ దీన్ని సాకుతున్నాడు. ఈ మేకకు భూరి అనే పేరు పెట్టుకున్నాడు.
మాంసాహారమంటే తెగ ఇష్టపడే ఈ మేక.. తన పొలంలోనే పుట్టిందని రఫీఖ్ తెలిపాడు. చికెన్, మటన్, చేప, గుడ్లు ఇలా నాన్-వెజ్ ఏది పెట్టినా సరే మహా ఇష్టంగా తినేస్తుందట ఈ మేక. ఈ విషయం తెలియడంతో చుట్టుపక్కల ప్రాంతాల ఈ మేకను చూసేందుకు తండోపతండాలుగా వస్తున్నారు. గత మూడేళ్లుగా ఈ మేక మాంసాహారం తింటుదట. అయితే, జన్యుపరమైన కారణాల వల్లే.. కొన్నిసార్లు జంతువులు ఇలా ప్రవర్తిస్తాయని పశు వైద్యులు పేర్కొంటున్నారు.
Also Read: కొత్తగా వాహనాలు కొన్నవారికి ఊరటనిచ్చే న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
Telugu Heroine: బుర్ఖాలో థియేటర్‌కి వెళ్లి సినిమా చూసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తించారా..?