- Telugu News Photo Gallery Spiritual photos Astro Tips : To get rid of financial crisis do these upay in telugu
Astro Tips ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారా.. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి..
Astro Tips: ఎవరికైనా ఒకొక్కసారి ఆర్ధిక ఇబ్బందులు తప్పనిసరి.. అలా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా లేదా ఉద్యోగ-వ్యాపారంలో డబ్బు నష్టాన్ని ఎదుర్కొంటున్నట్లయితే.. జ్యోతిష్యులు చెప్పిన పరిహారాలను చేసి చూడవచ్చు.. దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక సంక్షోభం నుంచి ఈజీగా బయటపడతారు.
Updated on: Dec 31, 2021 | 4:23 PM

ప్రతి నెలా మీ సంపాదనలో కొంత భాగాన్ని దానం చేయండి. అలా దానం చేసేవారు లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందుతారు. అంతేకాదు ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. ఇంట్లోని స్త్రీలతో చాలా గౌరవంగా ఉండండి.. స్త్రీ లక్ష్మీదేవి స్వరూపం.

ఇంట్లో తులసి మొక్కను నాటండి. ప్రతిరోజూ సాయంత్రం మొక్క దగ్గర మట్టి ప్రమిదలో నెయ్యి దీపాన్ని వెలిగించండి. లక్ష్మీ దేవి అనుగ్రహం సదా మీ ఇంటిపై ఉటుంది.

నెలలో ఏదైనా శుక్రవారం నాడు రోజున పెళ్లి కాని అమ్మాయిలకు తినడానికి పాయసం పెట్టండి.. అంతేకాదు కొంత డబ్బుతో పాటు పసుపు బట్టలు దానం చేయండి. దీంతో లక్ష్మీదేవి సంతోషంతో అనుగ్రహిస్తుంది.

ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రతి బుధవారం ఆవుకు పచ్చి గడ్డి తినిపించండి. ఇంట్లో పగిలిన పాత్రలను ఎప్పుడూ ఉంచవద్దు లేదా ఉపయోగించవద్దు. అవి సమస్యలకు కారణంగా నిలుస్తాయి.

ప్రతి శుక్రవారం రోజున విష్ణుమూర్తికి శంఖంతో నీటిని సమర్పించండి. దీంతో లక్ష్మి చాలా సంతోషించింది. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవిని పూజించి ఆశీస్సులు తీసుకుని నుదుటిపై కుంకుమను పెట్టుకోండి




