AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral news: ఉడుత సైకోగా మారితే ఎలా ఉంటదో తెలుసా.. అది ఏం చేసిందో మీరు అసలు ఊహించలేరు..

సాధారణంగా ఉడుతలు చూడడానికి ఎంతో క్యూట్‌గా ఉంటాయి. పైగా సాధుజంతువు. అలాంటి ఓ ఉడుత సైకోలా మారిపోయింది. రెండు రోజుల్లో రోఏకంగా 18 మందిని కరిచింది.

Viral news: ఉడుత సైకోగా మారితే ఎలా ఉంటదో తెలుసా.. అది ఏం చేసిందో మీరు అసలు ఊహించలేరు..
Basha Shek
|

Updated on: Dec 31, 2021 | 12:57 PM

Share

సాధారణంగా ఉడుతలు చూడడానికి ఎంతో క్యూట్‌గా ఉంటాయి. పైగా సాధుజంతువు. అలాంటి ఓ ఉడుత సైకోలా మారిపోయింది. రెండు రోజుల్లో రోఏకంగా 18 మందిని కరిచింది. యూకేలోని బక్లీ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పట్టణంలో నివాసముండే కొరిన్‌ రెనాల్డ్స్‌కు మూగజీవాలంటే అమితమైన ప్రేమ. అందులో భాగంగానే రోజూ ఓ ఉడుతకు ఆహారం అందించేది. అయితే, క్రిస్మస్‌ పండగకు కొద్దిరోజుల ముందు ఏం జరిగిందో ఏమో కానీ ఉడుత క్రూరంగా మారిపోయింది. ఎదురొచ్చినవారందరినీ కరిచేసింది. ఇందులో మొదటి బాధితురాలు ఎవరో కాదు దానికి రోజూ ఆహారం అందిస్తున్న కొరినే కావడం గమనార్హం. ఒకరోజు ఎప్పటిలాగే ఆహారం అందిస్తుండగా ఆమెను గట్టిగా కరిచి అక్కడి నుంచి పారిపోయింది ఉడుత. ఈ హఠాత్పరిణామానికి ఆశ్చర్యపోయిన ఆమె.. ఉడుత క్రూర స్వభావానికి గల కారణమేంటో తెలుసుకునే పనిలో పడింది.

రెండు రోజుల్లో 18 మందిని.. ఈక్రమంలో ఫేస్‌బుక్‌ను ఓపెన్‌ చేసిన కొరిన్‌కు దిమ్మతిరిగే షాక్‌. అందులో పోస్టులన్నీ ఉడుత గురించే కావడంతో ఆమె మరింత కంగారు పడిపోయింది. ఉడుత కరిచిందన్న పోస్టులు కనిపించడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా రెండు రోజుల వ్యవధిలోనే దాదాపు18 మంది ఉడుత బారిన పడ్డారు. దీని గురించి పట్టణమంతా తెలియడంతో ‘సైకో ఉడుత’ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. దీనికి ‘గ్రెమ్లిన్స్’ సినిమాలోని విలన్‌ పేరు (స్రైప్‌) పెట్టారు. కాగా ఉడుతను ఇలాగే వదిలేస్తే మరింతమంది బాధితులు తయారువుతారని భావించిన కొరిన్‌ ఉడుతను ఎలాగైనా బంధించాలనుకుంది. పథకం ప్రకారం రోజూ ఆహారం పెట్టేచోట ఉచ్చు పెట్టి దానిని బంధించింది. అనంతరం దానిని ‘ది రాయల్‌ సొసైటీ ఫర్‌ ద ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయల్టీ టు యానిమల్స్‌’ అనే సంస్థకు అప్పగించింది.

చివరకు ఏమైందంటే.. అయితే అక్కడి జంతు చట్టాల ప్రకారం ఉడుతలను అడవిలో వదిలేయడం చట్టరీత్యా నేరం. అందుకే ఓ పశువైద్యుడు ఇంజెక్షన్‌ చేసి ఉడుతకు కారుణ్య మరణం ప్రసాదించారు. కాగా ఈ విషయం తెలుసుకున్న కొరిన్‌ విషాదంలో మునిగిపోయింది. ‘సైకో ఉడుత నుంచి చాలామందిని కాపాడాననే సంతృప్తి ఉంది. అయితే ఓ జంతు ప్రేమికురాలినైన నా కారణంగా ఓ మూగజీవి ప్రాణాలను కోల్పోయింది’ అని ఆవేదన వ్యక్తం చేసిందీ యానిమల్‌ లవర్‌.

Also Read:

Sabarimala: మళ్లీ తెరచుకున్న శబరిమల ఆలయం.. భక్తులకు ఈ షరతులు వర్తిస్తాయి..

Ratan Tata Birthday: ఒక చిన్న కప్‌ కేక్‌.. రెండు క్యాండిల్స్.. నెట్టింట్లో వైరలవుతోన్న రతన్‌ టాటా బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వీడియో..

Sabarimala: మళ్లీ తెరచుకున్న శబరిమల ఆలయం.. భక్తులకు ఈ షరతులు వర్తిస్తాయి..