All Time Playing 11: ప్రపంచ వ్యాప్తంగా ఆల్ టైం ప్లేయింగ్ XI వీళ్లే.. నలుగురు భారత ప్లేయర్లకు చోటిచ్చిన అక్తర్..!
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేశాడు. ఈ జట్టులో అతను నలుగురు భారత మరియు నలుగురు పాకిస్థానీ ఆటగాళ్లను చేర్చుకున్నాడు.
Shoaib Akhtar All Time Playing 11: క్రికెట్ ప్రపంచంలో ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’గా ప్రసిద్ధి చెందిన పాకిస్థానీ మాజీ వెటరన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్, ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేశాడు. ఆల్ టైం ప్లేయింగ్ XIలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన 11 మంది ఆటగాళ్లను ఈ జాబితాలో చేర్చాడు. ఈ జట్టులో నలుగురు భారత వెటరన్లకు చోటు అక్తర్ చోటు కల్పించాడు.
ఈ నలుగురు భారతీయులకు దక్కిన చోటు.. భారత మాజీ దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్, మాజీ దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్‌లతోపాటు భారత్ కోసం మూడు ఐసీసీ ట్రోఫీలను గెలిచిన ఎంఎస్ ధోనీలను తన అత్యుత్తమ ప్లేయింగ్ 11లో ఎంపిక చేశాడు.
సచిన్‌కు జోడీగా గోర్డాన్ గ్రీనిడ్జ్ ఎంపిక.. సచిన్ టెండూల్కర్‌కు ఓపెనింగ్ పార్టనర్‌గా వెస్టిండీస్ మాజీ బ్యాట్స్‌మెన్ గోర్డాన్ గ్రీనిడ్జ్‌ని షోయబ్ అక్తర్ ఎంచుకున్నాడు. షోయబ్ అక్తర్ తన పాత సహచరుడు ఇంజమామ్-ఉల్-హక్‌ను మూడో నంబర్‌లో, సయీద్ అన్వర్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి ఎంపిక చేశాడు.
భారత్‌తో పాటు పాకిస్థాన్‌కు చెందిన నలుగురు ఆటగాళ్లను కూడా అక్తర్ ఈ జట్టులో చేర్చాడు. వీరిలో ఇంజమామ్-ఉల్-హక్, వసీం అక్రమ్, సయీద్ అన్వర్, వకార్ యూనిస్ ఉన్నారు. మరోవైపు, ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఇతర ఆటగాళ్లలో ఉన్నారు.
షోయబ్ అక్తర్ ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ XI టీం.. సచిన్ టెండూల్కర్, గోర్డాన్ గ్రీనిడ్జ్, ఇంజమామ్-ఉల్-హక్, సయీద్ అన్వర్, మహేంద్ర సింగ్ ధోనీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్, యువరాజ్ సింగ్, షేన్ వార్న్ (కెప్టెన్), వసీం అక్రమ్, కపిల్ దేవ్, వకార్ యూనిస్.
Also Read: IND vs SA: చారిత్రాత్మక విజయంలో ‘ఆ నలుగురిదే’ కీలకపాత్ర.. సెంచూరియన్‌లో సత్తా చాటిన పేస్ దళం..!
India Vs South Africa: తొలి టెస్ట్‌లో చిత్తుగా ఓడిన సఫారీలు.. భారత్ ఘన విజయం…