IND vs SA: చారిత్రాత్మక విజయంలో ‘ఆ నలుగురిదే’ కీలకపాత్ర.. సెంచూరియన్‌లో సత్తా చాటిన పేస్ దళం..!
IND vs SA 1st Test: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 113 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది.
IND vs SA 1st Test: సెంచూరియన్ వేదికగా భారత్ (IND), దక్షిణాఫ్రికా (SA) మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 113 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, దానికి సమాధానంగా ఆఫ్రికన్ జట్టు 191 పరుగులకు ఆలౌటైంది. భారత్ విజయంలో ఫాస్ట్ బౌలర్లు కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్‌లో లాగానే రెండో ఇన్నింగ్స్‌లోనూ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లను మహ్మద్ షమీ, బుమ్రా, సిరాజ్‌లు తమ అద్భుత డెలివరీలతో ఇబ్బంది పెట్టి లక్ష్యాన్ని చేరుకోనివ్వలేదు. సిరీస్‌లో తొలి మ్యాచ్ ఉత్కంఠగా సాగగా.. చివరికి భారత్ విజయం సాధించింది.
తొలి టెస్టులో ఫాస్ట్ బౌలర్లు 18 వికెట్లు తీశారు.. భారత జట్టు తరఫున తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ పేస్ అటాక్‌ను ధీటుగా ఎదుర్కోవడంలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ పూర్తిగా విఫలం అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ షమీ 5 వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా 2, శార్దూల్ ఠాకూర్ 2, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కు వికెట్ దక్కలేదు.
రెండో ఇన్నింగ్స్‌లోనూ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరిగారు. బౌలింగ్‌లో మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా చెరో మూడు వికెట్లు తీశారు. మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. కాగా రవిచంద్రన్ అశ్విన్ కూడా మ్యాచ్ చివరి ఓవర్లో కగిసో రబాడ, లుంగీ ఎంగిడిలను పెవిలియన్‌కు పంపి ఖాతా తెరిచాడు. ఓవరాల్ గా 20 వికెట్లలో 18 వికెట్లు ఫాస్ట్ బౌలర్ల పేరిటే ఉన్నాయి.
భారత బ్యాట్స్‌మెన్‌ల ప్రదర్శన కూడా తక్కువేం కాదు.. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. రాహుల్ 123 పరుగులు చేయగా, మయాంక్ 60 పరుగులు చేశాడు. అతడితో పాటు అజింక్యా రహానే 48, విరాట్ కోహ్లీ 35 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ పూర్తిగా పరాజయం పాలవడంతో ఆ జట్టు కేవలం 174 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ 34 పరుగులు చేశాడు.
Also Read: India Vs South Africa: తొలి టెస్ట్‌లో చిత్తుగా ఓడిన సఫారీలు.. భారత్ ఘన విజయం…
IND vs SA 1st Test : కుప్పకూలిన సఫారీలు.. తొలి టెస్ట్‌లో భారత్ ఘన విజయం..