India Vs South Africa: తొలి టెస్ట్‌లో చిత్తుగా ఓడిన సఫారీలు.. భారత్ ఘన విజయం…

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 94/4 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు బ్యాటింగ్...

India Vs South Africa: తొలి టెస్ట్‌లో చిత్తుగా ఓడిన సఫారీలు.. భారత్ ఘన విజయం...
Ind Vs Sa
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 30, 2021 | 5:00 PM

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 94/4 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు బ్యాటింగ్ ఆరంభించిన సఫారీ జట్టు 191 పరుగులు ఆలౌట్ అయింది. దీనితో ఇండియా 113 పరుగుల తేడాతో చారిత్రాత్మిక విజయాన్ని అందుకుంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఎల్గర్(77), బవుమా(35), డికాక్(21) ఫర్వాలేదనిపించారు. వీరు తప్ప మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ రాణించలేదు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ చెరో 3 వికెట్లు తీయగా.. అశ్విన్, సిరాజ్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 174 పరుగులకు ఆలౌట్ అయింది.

ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియాను ఎనిగిడి 6 వికెట్లు తీసి.. రబాడా 3 వికెట్లు తీసి వెన్ను విరిచాడు. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్‌‌లో సౌతాఫ్రికా భారత బౌలర్ల ధాటికి 197 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్‌ షమి 5 వికెట్లు, శార్దుల్‌ 2 వికెట్లు, బుమ్రా, సిరాజ్‌, చెరో వికెట్ పడగొట్టారు. కాగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కెఎల్ రాహుల్‌కు దక్కింది.

జట్ల స్కోర్:

ఇండియా 327 & 174 సౌతాఫ్రికా: 197 & 191

భారత్: కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛటీశ్వర్ పుజారా, అజింక్యా రహనే, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్

సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), మార్కరమ్, పీటర్సన్, డుస్సెన్, బవుమా, డికాక్(వికెట్ కీపర్), ముల్దర్, జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడా, ఎనిగిడి