AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: దక్షిణాఫ్రికాకు భారీ షాక్.. టెస్టులకు గుడ్ బై చెప్పిన స్టార్ ప్లేయర్.. సెంచూరియన్ ఓటమే కారణమా?

Quinton De Kock Retirement: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు.

IND vs SA: దక్షిణాఫ్రికాకు భారీ షాక్.. టెస్టులకు గుడ్ బై చెప్పిన స్టార్ ప్లేయర్.. సెంచూరియన్ ఓటమే కారణమా?
Quinton De Kock Retirement
Venkata Chari
|

Updated on: Dec 31, 2021 | 5:27 AM

Share

Quinton De Kock Retirement: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతని నిర్ణయంతో అందరూ షాక్ అవుతున్నారు. భారత్‌తో సెంచూరియన్ టెస్టులో డి కాక్ దక్షిణాఫ్రికా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 21 పరుగులు మాత్రమే చేశాడు.

దక్షిణాఫ్రికా తరఫున డి కాక్ వన్డే, టీ20 క్రికెట్ ఆడటం కొనసాగిస్తాడు. 2014లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన డి కాక్, ఈ ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. అయితే, జట్టు పేలవమైన ప్రదర్శనతో అతను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.

క్రికెట్ సౌతాఫ్రికా తన ప్రకటనలో, “వికెట్-కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశ్యంతో టెస్ట్ క్రికెట్‌కు తక్షణమే రిటైర్మెంట్ ప్రకటించాడు” అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.

టెస్ట్ కెరీర్ ఇలా.. దక్షిణాఫ్రికా తరఫున డికాక్ మొత్తం 54 టెస్టులు ఆడాడు. ఈ సమయంలో అతను 38.82 సగటుతో 3300 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో డి కాక్ బ్యాట్‌ నుంచి మొత్తం ఆరు సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు వచ్చాయి. అదే సమయంలో అతని అత్యధిక స్కోరు 141 పరుగులుగా నిలిచింది.

Also Read: IND vs SA: చారిత్రాత్మక విజయంలో ‘ఆ నలుగురిదే’ కీలకపాత్ర.. సెంచూరియన్‌లో సత్తా చాటిన పేస్ దళం..!

India Vs South Africa: తొలి టెస్ట్‌లో చిత్తుగా ఓడిన సఫారీలు.. భారత్ ఘన విజయం…

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?