AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI President: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సౌరవ్ గంగూలీ.. ఇంట్లోనే చికిత్స..

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గంగూలీకి కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో చేరాడు...

BCCI President: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సౌరవ్ గంగూలీ.. ఇంట్లోనే చికిత్స..
Ganguly
Srinivas Chekkilla
|

Updated on: Dec 31, 2021 | 3:18 PM

Share

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గంగూలీకి కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం అతనికి కరోనా నయం కాలేదు. కానీ ఇంట్లో చికిత్స జరుగుతుంది. భారత మాజీ కెప్టెన్‌కి ప్రస్తుతం తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్నాయి. దీంతో అతడిని డిశ్చార్జి చేయాలని ఆస్పత్రి వర్గాలు నిర్ణయించాయి.

BCCI ప్రెసిడెంట్ గంగూలీకి 3 రోజుల క్రితం కరోనా సోకింది. ఆ తర్వాత అతను వుడ్‌ల్యాండ్ హాస్పిటల్‌లో చేరాడు. 2 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన సౌరవ్ గంగూలీ డిశ్చార్జ్ అయ్యాడు. గంగూలీ ఆస్పత్రిలో చేరడం ఈ ఏడాది ఇది రెండోసారి. జనవరి 2021లో, అతను గుండెపోటు సమస్య కారణంగా చాలా కాలం పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది.

సౌరవ్ గంగూలీకి కరోనా సోకడానికి ముందు విరాట్ కోహ్లీతో విభేదాలు తలెత్తాయి. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు, BCCI విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను వన్డే కెప్టెన్‌గా చేసింది. కోహ్లీతో మాట్లాడిన తర్వాతే వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపాడు. అయితే ఆ తర్వాత విలేకరుల సమావేశంలో విరాట్ కోహ్లీ చెప్పిన మాటలు గంగూలీ చెప్పినదానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. కెప్టెన్సీ తొలగించడానికి గంటన్నర ముందే ఈ విషయాన్ని తనకు తెలిపారని కోహ్లీ చెప్పాడు. విరాట్‌ ప్రకటనపై గంగూలీ స్పందిస్తూ.. బోర్డు ఇప్పుడు ఏం చేసినా ఈ అంశంపై ఇప్పుడే ఏమీ చెప్పబోనని చెప్పాడు.

Read  Also.. Ashes Series: నాలుగో టెస్ట్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్‌.. కరోనా బారిన పడిన స్టార్‌ క్రికెటర్‌..

ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు
వడ్డీ కట్టక్కర్లేదు.. బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పనిలేదు..
వడ్డీ కట్టక్కర్లేదు.. బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పనిలేదు..
నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్
నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్
తినేప్పుడు ఫుల్‌గా చెమటలు పడుతున్నాయా?.. అసలు కారణం ఇదే కావచ్చు
తినేప్పుడు ఫుల్‌గా చెమటలు పడుతున్నాయా?.. అసలు కారణం ఇదే కావచ్చు