AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మాకు స్వాతంత్య్రం వచ్చిందంటూ చెంగుచెంగున ఎగురుతున్న జింకలు.. నెట్టింట్లో వీడియో వైరల్..

Viral Video: జింకల సంఖ్యను పెంచడానికి, వాటికి ఆహార కొరత లేకుండా చేయడానికి అటవీ అధికారులు జింకలను ఒక అడవి నుంచి మరో అడవికి తరలిస్తూ ఉంటారు. దీనివల్ల వాటికి ఆహార సమస్య తీరుతుంది...

Viral Video: మాకు స్వాతంత్య్రం వచ్చిందంటూ చెంగుచెంగున ఎగురుతున్న జింకలు.. నెట్టింట్లో వీడియో వైరల్..
Release Of Deer Into The Wi
Surya Kala
|

Updated on: Dec 31, 2021 | 2:30 PM

Share

Viral Video: జింకల సంఖ్యను పెంచడానికి, వాటికి ఆహార కొరత లేకుండా చేయడానికి అటవీ అధికారులు జింకలను ఒక అడవి నుంచి మరో అడవికి తరలిస్తూ ఉంటారు. దీనివల్ల వాటికి ఆహార సమస్య తీరుతుంది. అన్ని అడవుల్లో జింకలు పెరుగుతాయి… అంతే కాకుండా వీటి ద్వారా వన్య వృగాలకు కూడా ఆహారం దొరుకుతుంది. తాజాగా అలాంటి ఓ సందర్భాన్ని నెటిజన్లతో షేర్ చేసుకున్నారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్. జింకలకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

నిజానికి ఈ వీడియో ఇప్పటిది కాదట. గతేడాది ఉదయం 5 గంటల సమయంలో ఆ వీడియోని స్వయంగా తానే షూట్ చేసినట్లు పర్వీన్ కస్వాన్ తెలిపారు. అందులో అటవీ అధికారులు కొన్ని వాహనాల్లో ఓ అడవిలోకి వెళ్లారు. ఓ వ్యానులో పెద్ద సంఖ్యలో జింకల్ని తీసుకొచ్చారు. అక్కడ వ్యాన్ డోర్ తెరవగానే… జింకలు గుంపులు గుంపులుగా ఎగురుతూ అడవిలోకి పరుగులు పెట్టాయి. ఆ దృశ్యాన్ని పర్వీన్ కస్వాన్ వీడియో రికార్డ్ చేశారు. జింకల్ని ఎక్కడ వదిలిపెట్టిందీ చెప్పలేదు గానీ… అది వాటికి సురక్షిత ప్రాంతమని తెలిపారు. ఇలా వేర్వేరు ప్రాంతాల్లో జింకల్ని వదలడాన్ని ప్రే బేస్ ఆగ్మెంటేషన్ ప్రోగ్రామ్ అంటారు. దీని వల్ల అన్ని అడవుల్లో జింకలు పెరుగుతాయి. అలాగే వాటిపై ఆధారపడి జీవించే చిరుతలు, పులుల వంటి వాటికి జింకల రూపంలో ఆహారం లభిస్తుంది. డిసెంబర్ 29న పోస్ట్ చేసిన ఈ వీడియోని వేలల్లో చూస్తున్న నెటిజన్లు లైక్‌ చేస్తున్నారు. కాగా ఈ వీడియోలో దృశ్యం మంచు కురుస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. జింకలు రెండు గ్రూపులుగా పారిపోవడాన్ని నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. అద్భుత దృశ్యం అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

2021లో మంట పుట్టించిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. మరి న్యూ ఇయర్‌లో ఎలా ఉండబోతున్నాయి..!