Vaccination: ఈరోజు నుంచే 15 నుంచి 18 ఏళ్ల లోపు టీనేజర్లకు కూడా కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. ఎలా నమోదు చేసుకోవాలంటే..
ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విరుచుకుపడుతోంది. దీంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 నుంచి 18 ఏళ్ల లోపు టీనేజర్లకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
Vaccination for teenagers: ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విరుచుకుపడుతోంది. దీంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 నుంచి 18 ఏళ్ల లోపు టీనేజర్లకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు అంటే జనవరి 1 వతేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 15 నుంచి 18 ఏళ్ల టీనేజర్లు వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే ఏర్పాట్లు చేసినట్లు కోవిన్ ప్లాట్‌ఫామ్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. వీరంతా కోవిన్ యాప్‌లో జనవరి ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
ఆధార్ లేకపోయినా..
కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ లేకపోయినా కానీ అనుమతిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆధార్ తప్పనిసరి కాదనీ, దానికి బదులుగా స్టూడెంట్ ఐడీ కార్డుతో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేలా వెసులుబాటు కల్పించినట్లు డాక్టర్ శర్మ తెలిపారు. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత 15 నుంచి 18 ఏళ్ల మధ్య వారికి టీకాలు ఇవ్వడం ప్రారంభిస్తారు.
కోవిన్ లో రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోవచ్చు..
- ఆరోగ్య సేతు లేదా కోవిన్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- తరువాత మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వండి.
- ఒటీపీ కోసం ఆప్షన్ ఎంచుకోండి.
- మీ మొబైల్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై బటన్ ప్రెస్ చేయండి
- ఆరోగ్య సేతు యాప్ నుంచి అయితే.. కోవిన్ ట్యాబ్ లోకి వెళ్లి వ్యాక్సినేషన్ ట్యాబ్ క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అయ్యాకా.. మీ photo ఐడీ, నంబర్, పూర్తి పేరు ఎంటర్ చేయాలి.
- తరువాత వయసు, జెండర్ ఎంటర్ చేయాలి
- రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యాకా మీ మొబైల్ నెంబర్ కు కన్ఫర్మ్ మెసేజ్ వస్తుంది.
ఇవి కూడా చదవండి: Tirumala: ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.. గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమల కొండలు
Bank Holidays in January: జనవరిలో 16 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే..
Fact Check: వాట్సప్‌లో న్యూ ఇయర్ గిఫ్ట్.. అసలు విషయమేమిటంటే..