Bheemla Nayak: 2022 కి వెల్కమ్ చెబుతూ పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్.. భీమ్లా నాయక్ డీజే సాంగ్ రిలీజ్..

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ వెల్కమ్ చెబుతూ  భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ గొప్ప ట్రీట్ ఇచ్చింది. 2021 కి వీడ్కోలు పలుకుతూ.. 2022 కొత్త సంవత్సరానికి..

Bheemla Nayak: 2022 కి వెల్కమ్ చెబుతూ పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్.. భీమ్లా నాయక్ డీజే సాంగ్ రిలీజ్..
Bhimla Nayak
Follow us
Surya Kala

|

Updated on: Dec 31, 2021 | 9:07 PM

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ వెల్కమ్ చెబుతూ  భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ గొప్ప ట్రీట్ ఇచ్చింది. 2021 కి వీడ్కోలు పలుకుతూ.. 2022 కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతూ.. జరుపుకునే పార్టీల్లో మోత మ్రోగేలా డీజీ పాటను రిలీజ్ చేసింది. నిజానికి భీమ్లా నాయక్ మూవీ నుంచి నవంబర్  7వ తేదీన ‘లాలా భీమ్లా అడవి పులి’ సాంగ్ రిలీజ్ అయింది. ఓ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకుంది. అయితే అదే సాంగ్ ను డీజే వెర్షన్ లో మరోసారి చిత్ర యూనిట్ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా ఫ్యాన్స్ కు పండగే.. దీంతో ప్రస్తుతం ఈ సాంగ్ తో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రం రాసిన ఈ పాటను తాజాగా డీజే వెర్షన్ లో  రిలీజ్ చేశారు. ఈ డీజే  ‘లాలా భీమ్లా అడవి పులి’ సాంగ్ పవన్ కళ్యాణ్ అభిమానులనే కాదు.. సంగీత అభిమానులను కూడా ఓ రేంజ్ లో ఊపు ఊపడం ఖాయం. న్యూ ఇయర్ వెల్కమ్ పార్టీల్లో ఈ సాంగ్ భీబత్సం సృష్టిస్తుంది. ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. హోరెత్తిస్తున్నారు. థమన్ సంగీతం అందించగా.. అరుణ్ కౌండిన్య  ఈ సాంగ్ ను ఆలపించారు.

మలయాళంలో సూపర్‌హిట్‌గా మూవీ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్ లో పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే భీమ్లా నాయక్ తొలి సింగిల్, టీజర్, రానా పాత్ర డానియల్ శేఖర్ టీజర్ విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ లో పవన్ సరసన నిత్యమీనన్ నటిస్తుండగా రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.  ఈ సినిమా 2022, ఫిబ్రవరి 25వ తేదీన చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

Also Read:

 ఈ టికెట్ ధరతో సినిమా చూడడం మా వల్ల కాదు.. థియేటర్లు మూసేయండి నాయనా..నెటిజన్స్ ట్రోల్

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు