Theaters Ticket Price: ఈ టికెట్ ధరతో సినిమా చూడడం మా వల్ల కాదు.. థియేటర్లు మూసేయండి నాయనా..నెటిజన్స్ ట్రోల్

Telangana Theaters Ticket Price: పేద, మధ్యతరగతి అనే తేడా లేకుండా అందరికీ ఒకే ఒక వినోద సాధనం సినిమా.. అయితే ఇప్పుడా సినిమా కొందరికి అందని ద్రాక్షలా మారుతోంది. అవును! కొత్తగా..

Theaters Ticket Price: ఈ టికెట్ ధరతో సినిమా చూడడం మా వల్ల కాదు.. థియేటర్లు మూసేయండి నాయనా..నెటిజన్స్ ట్రోల్
Telangana Theater Ticket Pr
Follow us
Surya Kala

|

Updated on: Dec 31, 2021 | 7:26 PM

Telangana Theaters Ticket Price: పేద, మధ్యతరగతి అనే తేడా లేకుండా అందరికీ ఒకే ఒక వినోద సాధనం సినిమా.. అయితే ఇప్పుడా సినిమా కొందరికి అందని ద్రాక్షలా మారుతోంది. అవును! కొత్తగా వచ్చిన జీవోతో తెలంగాణలో థియేటర్‌ టికెట్ల రేట్లు అమాంతంగా పెరిగిపోయాయి. మరో వైపు ఆంధ్రలో టికెట్‌ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ప్రేక్షకులు కూడా అయోమయంలో పడిపోయారు. ఇటు తెలంగాణలో టికెట్ల ధరలు తగ్గించాలని, ఏపీలో టికెట్ల ధరలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరోవైపు చిన్న సినిమాలు, పెద్ద సినిమాలకు టికెట్ల ధరలు ఒకేలా ఉండటం కూడా వివాదానికి కారణమవుతోంది. భారీగా పెరిగిన టికెట్ల రేట్లతో చిన్న సినిమా బతకలేదని, చిన్న సినిమా నిర్మాతలు నష్టాలు మూట గట్టుకోవాల్సి వస్తుందని కొందరు సినీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉదాహరణకి హైదరాబాద్‌లోని మల్టిఫ్లెక్స్‌ థియేటర్లలో హయ్యెస్ట్‌ సినిమా టికెట్‌ రేట్‌ 350 రూపాయలుగా ఉంది. అయితే RRR లాంటి పెద్ద సినిమాకి జనం 350 రూపాయల టికెట్‌ పెట్టి సినిమా చూస్తారు. కానీ అర్జున ఫాల్గుణ లాంటి చిన్న సినిమాలకు కూడా థియేటర్లలో అదే ధర ఉంటే ప్రేక్షకులు వచ్చే అవకాశం లేదనేది కొంత మంది సినీ విశ్లేషకుల వాదన. దీంతో వారు కూడా సినీ ప్రేక్షకులకు మద్దతుగా మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లను తగ్గించాలని కోరుతున్నారు.

తెలంగాణ థియేటర్స్‌ టికెట్ రేట్లపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. మల్టీప్లెక్స్‌ లు 350 వసూలు చేస్తుండడంపై ఈ రేట్లు ‘మా వల్ల కాదు.. థియేటర్లు మూసేయండి నాయనా..!’ అంటూ మీమ్స్‌ తో విరుచుకుపడుతున్నారు మీమ్స్‌ క్రియేటర్స్ .

Also Read: