RRR Movie: ముంబైలో ఆర్ఆర్ఆర్ న్యూఇయర్ సెలబ్రెషన్స్.. ప్రమోషన్స్ వీరలెవల్..

మోస్ట్ ఎక్సయిటెడ్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి

RRR Movie: ముంబైలో ఆర్ఆర్ఆర్ న్యూఇయర్ సెలబ్రెషన్స్.. ప్రమోషన్స్ వీరలెవల్..
Rrr Team
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 31, 2021 | 7:50 PM

మోస్ట్ ఎక్సయిటెడ్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా.. అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‏తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేందుక్క జక్కన్న అండ్ టీం వరుస ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. సౌత్ టూ నార్త్ ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ సినిమాపై రోజు రోజూకీ క్యూరియాసిటీని పెంచేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‏తో ఫుల్ బిజీగా ఉంది చిత్రయూనిట్.

వరుస ప్రమోషన్స్‏తో బిజీగా గడిపస్తున్న జక్కన్న అండ్ టీ న్యూ ఇయర్ వేడుకలను భారీగా జరుపుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ముంబైలో న్యూయర్ వేడుకలను జరపుకోనున్నారు. ఇందుకోసం నిర్వహించిన ఈవెంట్‏లో రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, అలియా భట్, సల్మాన్ హజరయ్యారు. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ జీటీవీలో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ది కపిల్ శర్మ షోలో పాల్గొన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ టైటిల్ వెనుక ఉన్న అసలు విషయాన్ని బయటపెట్టారు. ఈ సినిమా ప్రారంభించినప్పుడు ఏ టైటిల్ పెట్టాలో అర్థం కాలేదు. దీంతో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఇలా ముగ్గురి పేర్లు కలిసేలా (ఆర్ఆర్ఆర్) అనుకున్నాం. సోషల్ మీడియాలో కూడా ఆ పేరుతోనే అప్డేట్స్ ఇచ్చాం. అన్ని భాషల నుంచి ఆర్ఆర్ఆర్‎‏కు మంచి స్పందన రావడంతో అదే పేరును కన్ఫార్మ్ చేశాం. నిజానికి ఆర్ఆర్ఆర్ అంటే రౌద్రం, రణం, రుధిరం అని చెప్పుకొచ్చారు జక్కన్న.

Also Read:Vishwak Sen: కరోనా భారిన పడ్డ పాగల్ హీరో.. క్యారంటైన్‏లో ఉన్నానంటూ ట్వీట్ చేసిన విశ్వక్ సేన్..

Samantha: అలాంటి పాత్రలు చేసి అలసిపోయాను.. వాళ్లే ఆ ఆలోచన మార్చారు.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..

Ilayaraja: వీడియోతో రూమర్స్‏కు చెక్ పెట్టిన ఇళయరాజా.. పాటతో న్యూఇయర్ జోష్ నింపిన మ్యాజిక్ మేస్ట్రో..

RRR : ఆర్ఆర్ఆర్ టైటిల్ పెట్టడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పేసిన జక్కన్న..