Bhola Shankar: భోళా శంకర్ నుంచి తీనుమారు సాంగ్ రిలీజ్.. మాస్ బీట్స్‌కు చిరు స్టెప్పులు..
కొట్టరా కొట్టు తీనుమారు అంటూ సాగే ఈ పాటను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు. మాస్ బీట్స్ తో ఈ పాట అదిరిపోయింది. అలాగే చిరు మాస్ స్టెప్పులకు కీర్తి పోటి పడి మరీ డ్యాన్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సాంగ్ ఎంతో కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

డైరెక్టర్ మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం భోళా శంకర్. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్నాయి. చాలా కాలం తర్వాత ఈ మూవీలో చిరును వింటెజ్ లుక్ చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరోవైపు ట్రైలర్ విడుదల చేసి మరింత హైప్ క్రియేట్ చేసిన మేకర్స్ ఇప్పుడు ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తోన్న ఈమూవీ ఆగస్ట్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే భోళా శంకర్ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా నుంచి తీనుమారు సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.
కొట్టరా కొట్టు తీనుమారు అంటూ సాగే ఈ పాటను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు. మాస్ బీట్స్ తో ఈ పాట అదిరిపోయింది. అలాగే చిరు మాస్ స్టెప్పులకు కీర్తి పోటి పడి మరీ డ్యాన్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సాంగ్ ఎంతో కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.




తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా వస్తుంది ఈ చిత్రం. గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో సిస్టర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ మూవీలో చిరు జోడిగా తమన్నా కనిపించనుంది. అలాగే చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తుంది. శ్రీముఖి, గెటప్ శ్రీను, సుశాంత్, రష్మీ గౌతమ్ కీలకపాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భోళా శంకర్ మేనియా కనిపిస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.
#RageOfBholaa from #BholaaShankar is out now 💥💥
– https://t.co/qUiVImSTdA@SagarMahati Thumping Musical 🥁
A film by @MeherRamesh@AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanthA @dudlyraj Rappers @asuramuzic @FerozIsreal @nawab_gang @AKentsofficial… pic.twitter.com/LI6NUqXSlJ
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
