Kathakeli Teaser: ‘కథా కేళి’ టీజర్ రిలీజ్.. హర్రర్ చిత్రంతో భయపెట్టేందుకు సిద్ధమైన ఈషా రెబ్బా..
ఇప్పటివరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, క్లాస్ మూవీస్ తెరకెక్కించిన డైరెక్టర్ ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్, హర్రర్ మూవీస్ తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ రూపొందించిన దర్శకులు సతీష్ విగ్నేష్.. ఇప్పుడు భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. కళ్యాణ్ రామ్ తో ఎంత మంచివాడవురా, శతమానం భవతి సినిమాలు తెరకెక్కించి హిట్స్ అందుకున్నారు సతీష్. కొద్ది కాలంగా ఆయన వరుసగా డిజాస్టర్స్ ఖాతాలో వేసుకుంటున్నారు.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద హర్రర్ కథా చిత్రాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. మసుధ, విరూపాక్ష సినిమాలు ఏ రేంజ్లో హిట్టయ్యాయో చెప్పక్కర్లేదు. దీంతో మేకర్స్ ఇప్పుడు ఇలాంటి ఫార్మాట్ కథలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో కంటెంట్ పై దర్శకులు ఫుల్ ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, క్లాస్ మూవీస్ తెరకెక్కించిన డైరెక్టర్ ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్, హర్రర్ మూవీస్ తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ రూపొందించిన దర్శకులు సతీష్ విగ్నేష్.. ఇప్పుడు భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. కళ్యాణ్ రామ్ తో ఎంత మంచివాడవురా, శతమానం భవతి సినిమాలు తెరకెక్కించి హిట్స్ అందుకున్నారు సతీష్. కొద్ది కాలంగా ఆయన వరుసగా డిజాస్టర్స్ ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆయన దర్శకత్వంలో రాబోతున్న సినిమా కథా కేళి.
చింతా గోపాలకృష్ణా రెడ్డి సమర్పణలో శతమానం భవతి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీ లోగోను, ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చేయగా.. టీజర్ ను స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ విడుదల చేశారు. ఇందులో ఈషారెబ్బ ప్రధాన పాత్రలో నటిస్తోంది. అలాగే పూజిత పొన్నాడ, అనన్య నాగళ్ల, నందిని రాయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. టీజర్ చూస్తుంటే ఓ బంగ్లా నేపథ్యంలో జరిగే కథగా తెలుస్తోంది. అలాగే ఓ పుస్తకం.. అందులో రాసి ఉన్న సంఘటనలకు ఇంట్లో జరిగే కథకి మధ్య తెలియని మిస్టరీ ఉందనేది అర్థమవుతుంది.
ఈ సినిమాలో నటిస్తోన్న హీరోయిన్స్ అందరూ తెలుగమ్మాయిలు కావడం విశేషం. ఇటీవల విడుదలైన విరూపాక్ష సినిమా సూపర్ హిట్ కావడంతో.. ఇప్పుడు కథాకేళి సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఈ చిత్రానికి ఎస్.కె. బాలచంద్రన్ సంగీతం అందించారు. సోమవారం జరిగిన టీజర్ లాంచ్ వేడుకకు దిల్ రాజ్, హరిశ్ శంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. శతమానం భవతి సినిమా టైటిల్ మాకు చాలా ప్రత్యేకం అని.. డీజే షూటింగ్ చేస్తున్న సమయంలో దిల్ రాజ్ పరిగెత్తుకొచ్చి మనం నేషనల్ అవార్డ్ కొట్టం అని చెప్పగానే చాలా సంతోషించామన్నారు.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
