AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannah: విజయ్‏తో ప్రేమాయణంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన తమన్నా.. అందుకే మనసుపడ్డానంటున్న మిల్కీబ్యూటీ..

గత కొద్ది రోజులుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉందంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ రూమర్స్ నిజమేనంటూ మిల్కీబ్యూటీ చెప్పుకొచ్చింది. లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ సమయంలోనే విజయ్ తో ప్రేమలో పడ్డానని తెలిపింది.

Tamannah: విజయ్‏తో ప్రేమాయణంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన తమన్నా.. అందుకే మనసుపడ్డానంటున్న మిల్కీబ్యూటీ..
Tamannah, Vijay Varma
Rajitha Chanti
|

Updated on: Jul 04, 2023 | 6:45 PM

Share

ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్ తమన్నా. దాదాపు 17 ఏళ్లుగా అగ్రకథానాయికగా సత్తా చాటుతుంది. ఇప్పుడు సినిమాలతోనే కాకుండా.. అటు వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది మిల్కీబ్యూటీ. అయితే ఇటీవల పలు వెబ్ సిరీస్‏లలో రొమాంటిక్ సీన్స్ చేసింది తమన్నా. జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా రొమాంటిక్ సీన్స్ చేయడంతో ఆమెపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరుగుతుంది. తమన్నా మొదటిసారి ఇలా శ్రుతిమించి నటించడంతో ఆమెపై వ్యతిరేకత వస్తుంది. ఇక తనపై వస్తున్న ట్రోలింగ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది మిల్కీబ్యూటీ. రొమాంటిక్ సీన్స్ హీరోస్ చేసినప్పుడు వారిని ఎందుకు ప్రశ్నించరు.. కేవలం హీరోయిన్స్ నటిస్తే ఇంత నెగిటివిటి ఎందుకు వస్తుందంటూ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను ప్రేమించడం గురించి చెప్పుకొచ్చింది.

గత కొద్ది రోజులుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉందంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ రూమర్స్ నిజమేనంటూ మిల్కీబ్యూటీ చెప్పుకొచ్చింది. లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ సమయంలోనే విజయ్ తో ప్రేమలో పడ్డానని తెలిపింది. ఇటీవల ఈ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్న తమన్నా.. తమ రిలేషన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

“విజయ్ వర్మ నా జీవితంలోకి వచ్చినందకు చాలా ఆనందంగా ఉంది. అతను మహిళలను గౌరవిస్తారు. ముఖ్యంగా నా అభిప్రాయాలకు గౌరవం ఇస్తాడు. అందుకే నేను అతడిని ప్రేమించాను. తనకు కుటుంబం అంటే చాలా ఇష్టం. ఇంట్లో వారితో ఎలా ఉంటారో బయటివారితో అలాగే ఉంటారు. ఇతరులను గౌరవించడం ప్రస్తుతం యువత నేర్చుకోవాలి. ఇతరులతో ఎలా ఉండాలో తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. మహిళలు ప్రతి విషయంలో రాజీ పడాలనే భావనను నేను అంగీకరించను.”అని అన్నారు తమన్నా. ప్రస్తుతం మిల్కీబ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు