Rajinikanth: మరోసారి సందడి చేయనున్న సూపర్ స్టార్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
తలైవాకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే రీసెంట్ గా వచ్చిన అన్నత్తే సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టిన విషయం తెలిసిందే. దాంతో రజినీకాంత్ నెక్స్ట్ సినిమ కోసం ఆయన అభిమానులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ఆయన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఆయన సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు ఫ్యాన్స్. తలైవాకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే రీసెంట్ గా వచ్చిన అన్నత్తే సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టిన విషయం తెలిసిందే. దాంతో రజినీకాంత్ నెక్స్ట్ సినిమ కోసం ఆయన అభిమానులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ తన నెక్స్ట్ మూవీ నెల్సన్ దిలీప్ కుమార్ తో చేస్తోన్న విషయం తెలిసిందే. నెల్సన్ రీసెంట్ గా దళపతి విజయ్ తో బీస్ట్ మూవీని తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కసిమీద ఉన్నాడు నెల్సన్. ఈ క్రమంలోనే ఓ పవర్ ఫుల్ కథతో సూపర్ స్టార్ తో సినిమా చేస్తున్నాడు.
ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా ఒకటి ఇప్పుడు రీ రిలీజ్ అవ్వనుంది. జినీ టైటిల్ రోల్ పోషించిన ‘అరుణాచలం’(1997) చిత్రం తన కెరీర్‌లో మెమరబుల్ మూవీగా నిలవడమే కాకుండా… బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రానుంది.
తాజాగా ‘అరుణాచలం’ మాస్టర్ ప్రింట్ ను సన్ టీవీ రెడీ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దీపావళి కానుకగా ‘అరుణాచలం’ చిత్రాన్ని సన్ టీవీలో ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు నిర్వాహకులు. ఈ నేపథ్యంలో ‘అరుణాచలం’కు సంబంధించి ప్రకటనలతో సన్ టీవీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక ఈ సినిమా కోసం తలైవా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








