Prabhas- Billa Movie: థియేటర్లలో బిల్లా రీరిలీజ్.. ఫ్యాన్స్ హంగామా చూసి ఎమోషనలైన ప్రభాస్ సిస్టర్..
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్లో కూడా బిల్లా చిత్రాన్ని రీరిలీజ్ చేశారు. ఈ సినిమాను చూసేందుకు కృష్ణంరాజు పెద్ద కుమార్తె.. ప్రభాస్ చెల్లెలు ప్రసీద హాజరయ్యారు. ఫ్యాన్స్ మధ్య కూర్చొ న్ని బిల్లా సినిమాను చూశారు.
తెలుగు రాష్ట్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందడి నెలకొంది. రెండు రోజులుగా ముందు నుంచే డార్లింగ్ ఫ్యాన్స్ సెలబ్రెషన్స్ షూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డార్లింగ్ బర్త్ డే సందర్భంగా బిల్లా చిత్రాన్ని రెండు రాష్ట్రాల్లో రీరిలీజ్ చేశారు మేకర్స్. దీంతో థియేటర్ల వద్ద అభిమానులు రచ్చ చేశారు. ఏకంగా థియేటర్లోనే బాణసంచా కాల్చడంతో కాల్చడంతో స్క్రీన్ ముందు అగ్నిప్రమాదం జరిగింది. ఇక మరిన్ని థియేటర్లలలో ఫ్యాన్స్ సందడి చేశారు. తాజాగా ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్లో కూడా బిల్లా చిత్రాన్ని రీరిలీజ్ చేశారు. ఈ సినిమాను చూసేందుకు కృష్ణంరాజు పెద్ద కుమార్తె.. ప్రభాస్ చెల్లెలు ప్రసీద హాజరయ్యారు. ఫ్యాన్స్ మధ్య కూర్చొ న్ని బిల్లా సినిమాను చూశారు.
బిల్లా సినిమాను చూస్తూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడం.. మరోసారి ప్రభాస్..కృష్ణంరాజును కలిసి తెరపై చూడడం సంతోషంగా ఉందంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రసీద మాట్లాడుతూ.. ” అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా బిల్లా సినిమాను రీరిలీజ్ చేయండి ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత నాన్నను.. అన్నయ్యను స్క్రీన్ పై మరోసారి చూడడం చాలా సంతోషంగా ఉంది. మేమంత సినిమాను చాలా బాగా ఎంజాయ్ చేశాం. అభిమానులు ఎంజాయ్ చేయడం చూస్తుంటే ఎమోషనల్ గా ఫీలయ్యాం ” అంటూ భావోద్వేగానికి గుర్యయారు. అనంతరం థియేటర్ వద్ద కేక్ కట్ చేసి ప్రభాస్ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
అయితే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బిల్లా చిత్రాన్ని రీరిలీజ్ చేసి.. కృష్ణంరాజును ముఖ్య అతిథిగా పిలిచి ఈ చిత్రాన్ని ప్రదర్శించాలని అనుకున్నామని ఇటీవల డైరెక్టర్ మోహర్ రమేష్ తెలిపారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న సీనియర్ నటుడు కృష్ణంరాజు సెప్టెంబర్ 11న మరణించిన సంగతి తెలిసిందే.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.