Colour Photo : థియేటర్లలో సందడి చేయనున్న ‘కలర్ ఫోటో’.. రిలీజ్ టైం ఫిక్స్ చేసిన మేకర్స్.. ఎప్పుడంటే ?..
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన కలర్ ఫోటో సినిమాకు డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. ఇందులో సుహాస్ సరసన చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. అయితే ముందుగా ఈ మూవీని థియేటర్లలో
కలర్ ఫోటో.. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు.. ఇటీవల జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు సైతం సొంతం చేసుకుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. ఇందులో సుహాస్ సరసన చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. అయితే ముందుగా ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నా.. కరోనా సంక్షోభం కారణంగా తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో విడుదల చేశారు. ఈ మూవీ సినీ ప్రియులను ఆకట్టుకోవడమే కాకుండా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రతి సన్నివేశం ..ముఖ్యంగా చాందినీ నటనకు ప్రతి ప్రేక్షకుడి కళ్లు చెమ్మగిల్లాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది.
ఈ సినిమా నిర్మాత సాయి రాజేశ్.. డైరెక్టర్ సందీప్ రాజ్ కలర్ ఫోటో థ్రియాట్రికల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. వచ్చే నెల అంటే నవంబర్ 19న ఈ సినిమాను థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో మూవీ లవర్స్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాను అమృత ప్రొడక్షన్స్, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి. ఇందులో హర్ష, శ్రీదివ్య, సునీల్ కీలకపాత్రలలో నటించగా.. కాలభైరవ సంగీతం అందించారు.
పేద, ధనిక.. కులాంతర, మతాంతర అంశాలను కాకుండా.. వర్ణ వివక్షను ఇతివృత్తంగా చేసుకుని ఈ ప్రేమకథను తెరకెక్కించారు డైరెక్టర్ సందీప్ రాజ్. అప్పటివరకు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ చేసిన సందీప్ దర్శకుడిగా తీసిన మొదటి సినిమా ఇదే. అలాగే సుహాస్ హీరోగా నటించి ఫస్ట్ మూవీ ఇదే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా నేషనల్ అవార్డ్ అందుకుని అందరి దృష్టి ఆకర్షించింది. ఇక ఇప్పుడు నేరుగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Yes….2 years for colourful blockbuster.. And We are releasing in theatres on NOVEMBER 19th 2022…#ColourPhotoOnNov19th #ColourPhoto pic.twitter.com/6c2P8qjcu1
— Sai Rajesh (@sairazesh) October 23, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.