Kantara: క్రేజీ న్యూస్‌.. మెగా పవర్‌స్టార్‌ను డైరెక్ట్ చేయనున్న కాంతారా దర్శకుడు.?

కాంతారా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. కన్నడ సినిమా స్థాయిని మరోసారి ఇండియాకు పరిచయం చేసిందీ చిత్రం. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి రికార్డు కలెక్షన్లను సాధించి బ్లాక్‌ బ్లస్టర్‌గా నిలిచింది. విడుదలైన అన్ని భాషల్లో అనూహ్య విజయాన్ని...

Kantara: క్రేజీ న్యూస్‌.. మెగా పవర్‌స్టార్‌ను డైరెక్ట్ చేయనున్న కాంతారా దర్శకుడు.?
rishab Shetty next movie with ram charan
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 23, 2022 | 6:59 PM

కాంతారా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. కన్నడ సినిమా స్థాయిని మరోసారి ఇండియాకు పరిచయం చేసిందీ చిత్రం. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి రికార్డు కలెక్షన్లను సాధించి బ్లాక్‌ బ్లస్టర్‌గా నిలిచింది. విడుదలైన అన్ని భాషల్లో అనూహ్య విజయాన్ని అందుకుందీ చిత్రం. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా వసూళ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీపావళి వరుస సెలవులు ఉండడంతో ఈ సినిమా కలెక్షన్లను మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ సినిమా విజయంలో దర్శకుడు, నటుడు రిషబ్‌ శెట్టిది కీలక పాత్ర అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణ కథను అత్యంత అద్భుతంగా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులతో ఔరా అనిపించింది. దీంతో రిషబ్‌ శెట్టి ఒక్క కన్నడనాటే కాకుండా దేశమంతా మారుమోగింది. దీంతో ఈ డైరెక్టర్‌ తర్వాతి చిత్రంపై ఇప్పుడే వార్తలు షికార్లు చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం రిషబ్‌ శెట్టి తెలుగులో ఓ సినిమా చేయనున్నాడనే చర్చ మొదలైంది. రామ్‌ చరణ్‌ ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడనేది సదరు వార్త సారంశం.

శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న చెర్రీ.. ప్రస్తుతం ట్రిపులార్‌ జపాన్‌ విడుదల నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. శంకర్‌ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత రిషబ్‌ శెట్టి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తలో నిజంగానే నిజం ఉందా.? లేదా పుకారా.? అని తేలాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..