Anushka Sharma: “మీ గెలుపును మన కూతురు బాగా ఆస్వాదిస్తోంది”.. అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్..
మెల్ బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా దాయాది జట్టుపై అద్భుత విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జట్టు విజయంలో రన్ మెషిన్ విరాట్ కోహ్లి చెలరేగిపోయాడు. అతనికి..
మెల్ బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా దాయాది జట్టుపై అద్భుత విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జట్టు విజయంలో రన్ మెషిన్ విరాట్ కోహ్లి చెలరేగిపోయాడు. అతనికి హార్దిక్ పాండ్యా చక్కటి సహకారం అందించాడు. తాజాగా ఈ మ్యాచ్ పై బాలీవుడ్ నటి, విరాట్ సతీమణి అనుష్క శర్మ స్పందించింది. జట్టు విజయంతో దేశ ప్రజలకు ముందుగానే దీపావళి పండుగ వచ్చిందని అభివర్ణించారు. క్రికెట్ ప్రేమికుల కళ్లల్లో నిజమైన దీపావళి వెలుగులు తీసుకువచ్చారని ప్రశంసించారు. మీరు చాలా అద్భుతంగా ఆడారు. మీ పట్టుదల, సంకల్పం, నమ్మకం మనస్సులను కదిలించాయి. నా జీవితంలో అత్యుత్తమ మ్యాచ్‌ని ఇప్పుడే చూశాను. మన పాప వామిక మ్యాచ్ చూసి గదిలో డ్యాన్స్ వేస్తోంది. అర్థం చేసుకునే వయసు కానప్పటికీ విపరీతంగా ఎంజాయ్ చేస్తోంది. తన తండ్రి అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని ఆమె అర్థం చేసుకుంది. నిలకడ లేదని నీపై వచ్చిన వార్తలను చెక్ పెడుతూ సాధించిన ఈ విజయం అపూర్వం. ఈ గెలుపుతో మీరు మరింత బలంగా తయరవ్వాలని కోరుకుంటున్నాని అనుష్క శర్మ పోస్ట్ చేశారు.
కాగా.. టీ20 ప్రపంచకప్‌లో భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఆటలో టీమిండియాను గెలుపు వరించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 31 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై క్రీజులోకి వచ్చిన కోహ్లి, హార్దిక్ లు 78 బంతుల్లో 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరి క్షణంలో హార్దిక్ ఔటయ్యాడు, కానీ ఛేజ్ మాస్టర్ కోహ్లీ చివరి వరకు నిలిచి, టీమిండియాను గెలిపించాడు.
View this post on Instagram
మరోవైపు.. ఈ మ్యాచ్ లో విజయం సాధించేందుకు చివరి మూడు ఓవర్లలో 48 పరుగులు చేయాల్సి వచ్చింది. ఇది టీ20 ప్రపంచకప్ రికార్డుగా నిలిచింది. భారత్ కంటే ముందు ఆస్ట్రేలియా కూడా చివరి మూడు ఓవర్లలో 48 పరుగులు చేయాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో చివరి మూడు ఓవర్లలో విజయం కోసం నమోదైన అత్యధిక పరుగులు కూడా ఇవే కావడం విశేషం.