Billa Movie: బిల్లా స్పెషల్ షోలో ఫ్యాన్స్ అత్యుత్సాహం.. థియేటర్ లో బాణాసంచా కాల్చడంతో సీట్లకు మంటలు

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్లో బిల్లా సినిమా స్పెషల్ షోని ప్రదర్శిస్తున్నారు.  తమ అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకలను థియేటర్ లో ఘనంగా నిర్వహించారు

Billa Movie: బిల్లా స్పెషల్ షోలో ఫ్యాన్స్ అత్యుత్సాహం.. థియేటర్ లో బాణాసంచా కాల్చడంతో సీట్లకు మంటలు
venkatrama theater in west godavari
Follow us
Surya Kala

|

Updated on: Oct 23, 2022 | 1:51 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. తమ అభిమాన హీరో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో వేడుకలను నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మళ్ళీ బిల్లా సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. అయితే ఫ్యాన్స్ అత్యుత్సాహంతో చేసిన ఓ పనితో బిల్లా సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ లో మంటలు చెలరేగాయి. అయితే వెంటనే థియేటరు  సిబ్బంది, అభిమానులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్లో బిల్లా సినిమా స్పెషల్ షోని ప్రదర్శిస్తున్నారు.  తమ అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకలను థియేటర్ లో ఘనంగా నిర్వహించారు. థియేటర్లో కేకు కట్ చేశారు.  కొంతమంది  ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. థియేటర్‌లో బాణసంచా కాల్చారు. దీంతో సీట్లకు మంటలు అంటుకున్నాయి.

మరోవైపు కేకు మీద  క్యాండిల్ సీట్ల మధ్య పడి అక్కడ కూడా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా సినిమా థియేటర్ లో మంటలు ఏర్పడడంతో  ప్రేక్షకులు భయంతో థియేటరు  నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే స్పందించిన థియేటర్ సిబ్బంది .. కొంతమంది ఫ్యాన్స్ కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు. ఇటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో