Happy Birthday Prabhas: ప్రభాస్ బర్త్ డేకి ఆదిపురుష్ టీమ్ స్పెషల్ గిప్ట్.. వానర సైన్యంతో రామయ్య పోస్టర్ రిలీజ్

విల్లుని పట్టుకుని వానర సైన్యంతో యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ఉన్న రామయ్య లుక్ లో ప్రభాస్ ఆకట్టుకుంటున్నాడు. రామాయ‌ణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ కు ఓంరౌత్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న సంగతి తెలిసిందే.

Happy Birthday Prabhas: ప్రభాస్ బర్త్ డేకి ఆదిపురుష్ టీమ్ స్పెషల్ గిప్ట్.. వానర సైన్యంతో రామయ్య పోస్టర్ రిలీజ్
Happy Birth Day Prabhas
Follow us
Surya Kala

|

Updated on: Oct 23, 2022 | 11:14 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సంబరాలు అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు ప్రభాస్ తన 43వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ పలు సామజిక కార్యక్రమాలు చేస్తూ.. తమ అభిమానాన్ని చాటు కుంటున్నారు. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆదిపురుష్ యూనిట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. చిత్ర యూనిట్ ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.  రాముడి లుక్ లో ఉన్న ప్రభాస్ పోస్టర్ ను అభిమానులకు కానుకగా ఇచ్చింది. విల్లుని పట్టుకుని వానర సైన్యంతో యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ఉన్న రామయ్య లుక్ లో ప్రభాస్ ఆకట్టుకుంటున్నాడు. రామాయ‌ణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ కు ఓంరౌత్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఓం రౌత్ సోషల్ మీడియా వేదికగా రాముడి పోస్టర్ ను షేర్ చేశాడు. రాముడు యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ఉంది. అయితే ఇప్పటికే ఆదిపురుష్ టీజర్ పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్ ను నిలుపుదల చేయాలంటూ కొందరు కోర్టు మెట్లు ఎక్కారు. ముఖ్యంగా  ‘యానిమేషన్’ మూవీ అంటూ ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొత్త పోస్టర్ రివీల్‌తో, ఆదిపురుష్ ‘యానిమేషన్’ చిత్రంగా ఉండబోతోందని అభిమానులు పునరుద్ఘాటించారు. దీనిపై చాలా మంది ప్రభాస్ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరో వైపు ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నది చిత్ర యూనిట్..

ఇవి కూడా చదవండి

దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో ఆదిపురుష్ సినిమా రూపొందుతోంది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్నడ‌, హిందీ భాష‌ల్లో ఆదిపురుష్ రిలీజ్ కానుంది. సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తోన్న ఈ సినిమాను మోష‌న్ క్యాప్చర్ టెక్నాల‌జీతో పాటు త్రీడీ, ఐమాక్స్ వెర్షన్స్‌లో తెరకెక్కిస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నది.

మరోవైపు ఈరోజు రిలీజైన కొత్త ఆదిపురుష్ పోస్టర్‌కు నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. ప్రభాస్ కొత్త లుక్‌పై స్పందిస్తూ, ఒక ట్విట్టర్ వినియోగదారు 2023 డిజాస్టర్ పక్కా అంటే.. మరొకరు ప్రభాస్ ముఖాన్ని మార్చేశారు అంటూ బాధను వ్యక్తం చేస్తున్నాడు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!