T20 WORLD CUP: పాక్ తో విజయం తర్వాత.. ‘కింగ్ కోహ్లీ’ అదిరిపోయే గ్రాఫిక్ ఇమేజ్ ను షేర్ చేసిన ICC
టీ20 ప్రపంచకప్ లో భాగంగా సూపర్-12లో భారత్ తన తొలి మ్యాచ్ ను ఆదివారం పాకిస్తాన్ తో తలపడింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. ఈ విజయంలో మాజీ సారధి విరాట్ కోహ్లీ కీలక పాత్ర..
టీ20 ప్రపంచకప్ లో భాగంగా సూపర్-12లో భారత్ తన తొలి మ్యాచ్ ను ఆదివారం పాకిస్తాన్ తో తలపడింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. ఈ విజయంలో మాజీ సారధి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో మ్యాచ్ తర్వాత ఐసీసీ కింగ్ కోహ్లీకి సంబంధించిన ఓ గ్రాఫిక్ ఇమేజ్ ను ఐసీసీ షేర్ చేసింది. టీ20 ప్రపంచ కప్ 2022 సూపర్ 12 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ ఓడించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆదివారం తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ‘కింగ్’ విరాట్ కోహ్లీ యొక్క గ్రాఫిక్‌ను షేర్ చేసుకుంది. ”రాజు తిరిగి వచ్చాడు” విరాట్ కోహ్లి అనే క్యాప్షన్ తో ఐసిసి ఈ గ్రాఫిక్స్ ఇమేజ్ ను షేర్ చేస్తూ ట్వీట్ చేసింది. కోట ముందు సింహాసనంలో విరాట్ కోహ్లీ కూర్చున్నట్లు గ్రాఫిక్ ఇమేజ్ లో చూపించారు. ఆస్ట్రేలియా వేదికగా మెల్ బోర్న్ లో జరిగిన ICC పురుషుల T20 ప్రపంచ కప్‌లో సూపర్ 12 మ్యాచ్ లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో విరాట్ కోహ్లీ అందరినీ ఆశ్చర్యపర్చే నాక్ ఆడాడు. వరుసగా వికెట్లు పడుతున్నా.. చివరి వరకు వికెట్ నష్టపోకుండా జాగ్రత్తగా ఆడుతూ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 31 పరుగులకే భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. మ్యాచ్ పై భారత క్రికెట్ అభిమానులు దాదాపు ఆశలు వదులుకున్నారు. అయితే 37 బంతుల్లో 40 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యాతో కలిసి 113 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యంతో కోహ్లీ జట్టును తిరిగి మ్యాచ్‌లోకి తీసుకువచ్చాడు.
మూడు ఓవర్లలో విజయానికి 48 పరుగులు కావాల్సి ఉంది. అయితే చివరి ఓవర్ వరకు కూడా భారత్ విజయం కష్టమనే అనిపించింది. కాని కోహ్లీ తన అద్భుతమైన షాట్లతో అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించి.. పాకిస్తాన్ పై టీమిండియాను గెలిపించాడు. విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
The KING is back ?
Take a bow, Virat Kohli ?#T20WorldCup | #INDvPAK pic.twitter.com/OdAnbmso0h
— ICC (@ICC) October 23, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..