AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK T20: ఇండియా-పాక్ మ్యాచ్‌లో ఉద్వేగభరిత సన్నివేశాలు.. మ్యాచ్ ముందు రోహిత్.. మ్యాచ్ తరువాత కోహ్లీ, పాండ్యా..

ఇండియా-పాక్‌ మ్యాచ్‌.. ఇది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు. కోట్లాది మంది ఎమోషన్.. ఇదో పోరాటం.. చిరకాల ప్రత్యర్ధుల సమరం. నిన్న జరిగిన మ్యాచ్‌లోనూ టీమిండియా..

IND vs PAK T20: ఇండియా-పాక్ మ్యాచ్‌లో ఉద్వేగభరిత సన్నివేశాలు.. మ్యాచ్ ముందు రోహిత్.. మ్యాచ్ తరువాత కోహ్లీ, పాండ్యా..
Ind Vs Pak T20
Shiva Prajapati
|

Updated on: Oct 23, 2022 | 10:34 PM

Share

ఇండియా-పాక్‌ మ్యాచ్‌.. ఇది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు. కోట్లాది మంది ఎమోషన్.. ఇదో పోరాటం.. చిరకాల ప్రత్యర్ధుల సమరం. నిన్న జరిగిన మ్యాచ్‌లోనూ టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో కనిపించిన కొన్ని సీన్స్ అభిమానుల మనసును కట్టిపడేశాయి. మ్యాచ్‌ ముందు భారత జాతీయ గీతాలాపన సమయంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎమోషనల్‌ అయ్యాడు. జాతీయ గీతాలాపన ప్రారంభం అయిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు హిట్‌మ్యాన్‌ ముఖంలో ఉద్వేగానికి లోనైన హావభావాలు స్పష్టంగా కనిపించాయి. టీ20 వరల్డ్‌కప్‌లో తొలిసారి టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడన్న ఆనందమో లేక ఎలాగైనా ఈ సారి టీమిండియాను ఛాంపియన్‌గా నిలబెట్టాలన్న కసో.. మొత్తానికి జాతీయ గీతాలాపన సందర్భంగా హిట్‌మ్యాన్‌ పెట్టిన ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

ఈ మ్యాచ్‌లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ.. అద్భుత విజయాన్ని అందించాడు. 53 బంతుల్లో విరాట్‌ కోహ్లీ 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. అభిమానులకు ముందే దీపావళి అందించాడు. పాక్ బౌలర్ల తప్పిదాలను క్యాష్ చేసుకున్న విరాట్‌.. తనదైన స్టయిల్‌లో విరుచుకుపడి ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. ఇక ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా కోహ్లీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చి.. విన్నింగ్‌లో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఓ అరుదైన రికార్డును కూడా దక్కించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 1000 పరుగులు, 50 వికెట్లు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా, ఓవరాల్‌గా ఆరో అంతర్జాతీయ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు హార్దిక్ పాండ్యా. అయితే, మ్యాచ్‌లో విజయం సాధించాక విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా ఇద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు. హార్ధిక్ అయితే కన్నీరు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..