Vastu Tips: వంట గదిలో ఈ రంగు పెయింట్ అస్సలు వేయొద్దు.. కొన్ని వస్తువులు కూడా అక్కడ పెట్టొద్దు..

దీపావళి పర్వదినం సమీపించింది. అందరూ తమ తమ ఇళ్లను అందంగా ముస్తాబు చేసుకుంటున్నారు. కొందరు తమ ఇంటిని పునర్నిర్మించుకుంటున్నారు.

Vastu Tips: వంట గదిలో ఈ రంగు పెయింట్ అస్సలు వేయొద్దు.. కొన్ని వస్తువులు కూడా అక్కడ పెట్టొద్దు..
Kitchen Vastu
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 21, 2022 | 10:15 PM

దీపావళి పర్వదినం సమీపించింది. అందరూ తమ తమ ఇళ్లను అందంగా ముస్తాబు చేసుకుంటున్నారు. కొందరు తమ ఇంటిని పునర్నిర్మించుకుంటున్నారు. అయితే, ఇంటి పునర్నిర్మాణ సమయంలో వాస్తును దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వంటగది విషయంలో వాస్తు తప్పకుండా పట్టించుకోవాలి. ఇంట్లో అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన భాగం వంటగది. అందుకే వంటగది విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వంటగదిని ఇంటి ఆత్మగా అభివర్ణిస్తారు వాస్తు నిపుణులు. వంటగది అనేక అంశాలకు ముడిపడిఉంటుంది. వంటగదిలో అపారమైన శక్తులు ఉన్నాయని, మంచి, చెడును ఆకర్షిస్తుందని చెబుతారు. మరి వంటగది ఎలా ఉండాలి?

వంటగదికి ఏ రంగు వేయాలి?

వాస్తు ప్రకారం నారింజ, పసుపు, ఆకుపచ్చ వంటి రంగులు వంటగదికి వేస్తే మంచి జరుగుతుంది. జ్యోతిష్య పండితుల అభిప్రాయం ప్రకారం.. వంటగది గోడల రంగులు ముదురు రంగులో ఉండకూడదు. ముదురు బూడిద రంగు, గోధుమ రంగు, నలుపు రంగులను వంటగదికి వేయకూడదు. ఇవి సానుకూల శక్తిని అడ్డుకుంటాయి. వంటగది గోడలకు నలుపు రంగు వేస్తే ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. ముదురు నీలం రంగు కూడా అనేక కష్టాలకు దారి తీస్తుంది. కుటుంబంలో తీవ్ర నిరాశ నిస్పృహలు నెలకొంటాయి.

వంటగదిని వాస్తు ప్రకారం ఇలా సెట్ చేయండి..

1. వంటగది ఇంటికి ఆగ్నేయ దిశలో ఉండేలా చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి

2. గ్యాస్ సిలిండర్, ఓవెన్‌తో కూడిన వాష్ బేషన్‌లు, వంట సామాగ్రి ఎప్పుడూ సమాంతరంగా ఉండొద్దు. అగ్ని, నీరు వ్యతిరేక అంశాలు. అందుకే వీటిని ఎప్పుడూ సమాంతరంగా ఉంచొద్దు. లేదంటే.. కుటుంబంలో చికాకులు ఏర్పడుతాయి.

3. వాష్ బేసిన్లు, వాషింగ్ మెషీన్లు, నీటి పైపులు, వంటగది కాలువలు వంటగది లోపల ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండాలి. నీటి విషయంలో సమతుల్యతను కాపాడుకుంటే.. సంపద, ఆరోగ్యం పరంగా అభివృద్ధి చెందుతారు.

4. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు రిఫ్రిజిరేటర్‌ను నైరుతి దిశలో ఉంచాలి.

5. ధాన్యాలు, ఇతర స్టాక్ వస్తువులను వంటగదికి నైరుతి దిశలో ఉంచాలి. ఇది అదృష్టం, శ్రేయస్సును కలిగిస్తుంది.

గమనిక: ప్రజల సాధారణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, వాస్తు నిపుణులు తెలిపిన సమాచారం మేరకు ఈ ఆర్టికల్‌ను పబ్లిష్ చేయడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..