AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: టీమిండియా విజయంతో పట్టరాని సంతోషంలో సన్నీ.. చిన్న పిల్లాడిలా ఎగిరి గంతులేస్తూ డ్యాన్స్

కాగా ఆఖరు బంతికి టీమిండియా విజయం సాధించడంతో దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ సంతోషం పట్టలేకపోయాడు. చిన్నపిల్లాడిలాగా ఎగిరి గంతులేస్తూ డ్యాన్స్‌ చేశాడు. అతనితో ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా జత కలిశాడు.

T20 World Cup: టీమిండియా విజయంతో పట్టరాని సంతోషంలో సన్నీ.. చిన్న పిల్లాడిలా ఎగిరి గంతులేస్తూ డ్యాన్స్
Sunil Gavaskar, Irfan
Basha Shek
|

Updated on: Oct 24, 2022 | 7:53 AM

Share

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ వేదికగా ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. చివరి బంతికి రోహిత్ శర్మ అండ్ కంపెనీ టీ 20 ప్రపంచకప్‌లో దాయాదిపై అద్భుత విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్‌ అభిమానులకు అసలైన మజాను అందించింది. భారత్‌ విజయం సాధించగానే ఆటగాళ్లతో పాటు అభిమానులు, పిల్లలు ఆనందంలో మునిగిపోయారు. కొన్ని చోట్ల పటాసులు పేలుస్తూ ముందుగానే సంబరాలు చేసుకున్నారు. కాగా ఆఖరు బంతికి టీమిండియా విజయం సాధించడంతో దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ సంతోషం పట్టలేకపోయాడు. చిన్నపిల్లాడిలాగా ఎగిరి గంతులేస్తూ డ్యాన్స్‌ చేశాడు. అతనితో ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా జత కలిశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

చక్‌ దే ఇండియా..

కాగా ఈ మ్యాచ్‌లో కామెంటేటర్లుగా వ్యవహరించిన గవాస్కర్‌, పఠాన్‌ చివరి ఓవర్‌లో బౌండరీ లైన్‌ దగ్గరకు వచ్చారు. ఇక అశ్విన్‌ విన్నింగ్‌ రన్‌ కొట్టగానే సునీల్‌ గవాస్కర్‌ రెడ్‌ క్యాప్‌ ధరించి డ్యాన్స్‌ చేస్తూ కనిపించాడు. చప్పట్ల కొడుతూ ఎగిరి గంతులేశాడు. గవాస్కర్‌ను చూసి ఇర్ఫాన్ పఠాన్ కూడా ఆశ్చర్యపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్న పఠాన్‌.. ‘ఎంసిజిలో చూడటానికి ఇదిచాలా అద్భుతమైన దృశ్యం. సన్నీ పాజీ డ్యాన్స్‌ని కూడా ఆపలేకపోయింది. విరాట్ కోహ్లీ నువ్వు రియల్‌ కింగ్.. ఇండియా..’ అంటూ ఎమోజీలు షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

కాగా ఈ విజయంతో గత టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. కాగా ఆదివారం మ్యాచ్‌కు 90,293 మంది హాజరయ్యారు. అందులో కనీసం 60,000 మంది భారతీయులే కావడం గమనార్హం. ఇక మ్యాచ్‌ గెలవగానే స్టేడియమంతా చక్‌ దే ఇండియా.. జయహో జయహో అన్న నినాదాలే వినిపించాయి.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..