IND vs PAK: భారత్, పాక్ మ్యాచ్‌ అంటే అట్లుంటది మరి.. రికార్డుల్లోనూ తగ్గేదేలే..

India Vs Pakistan T20 WC 2022 Records: మెల్‌బోర్న్‌లో భారత జట్టు విజయంతో ఎన్నో భారీ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. అవేంటో ఓసారి చూద్దాం..

IND vs PAK: భారత్, పాక్ మ్యాచ్‌ అంటే అట్లుంటది మరి.. రికార్డుల్లోనూ తగ్గేదేలే..
Ind Vs Pak Records
Follow us

|

Updated on: Oct 23, 2022 | 7:12 PM

టీ20 ప్రపంచ కప్ 2022లో తమ మొదటి మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఆఖరి బంతికి భారత్‌ విజయం సాధించడంతో మ్యాచ్‌ నరాలు తెగే ఉత్కంఠగా సాగింది. విరాట్ కోహ్లీ 53 బంతుల్లో అజేయంగా 82 పరుగులు చేసి భారత్‌కు ఈ విజయాన్ని అందించాడు. ఈ విజయంతో భారత జట్టు తన పేరిట అనేక రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. అలాంటి కొన్ని రికార్డులను ఓసారి చూద్దాం..

భారత్ ఖాతాలో చేరిన రికార్డులు..

  1. టీమిండియా ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు చివరి మూడు ఓవర్లలో 48 పరుగులు చేయాల్సి వచ్చింది. ఇది టీ20 ప్రపంచకప్ రికార్డుగా నిలిచింది.
  2. భారత్ కంటే ముందు ఆస్ట్రేలియా కూడా చివరి మూడు ఓవర్లలో 48 పరుగులు చేయాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించింది.
  3. టీ20 ప్రపంచకప్‌లో చివరి మూడు ఓవర్లలో విజయం కోసం నమోదైన అత్యధిక పరుగులు కూడా ఇవే కావడం విశేషం.
  4. కాగా, ఈ రెండు సార్లు బౌలింగ్ జట్టు పాకిస్థాన్‌ జట్టే కావడం గమనార్హం.

చివరి బంతికి భారత్‌ నాలుగోసారి విజయం..

  1. చివరి బంతికి భారత్‌ విజయం సాధించగా, చివరి బంతికి టీ20లో విజయం సాధించడం ఇది నాలుగోసారి.
  2. అంతకుముందు 2016లో ఆస్ట్రేలియాపై, 2018లో బంగ్లాదేశ్, వెస్టిండీస్‌పై భారత్ విజయం సాధించింది.

పాకిస్థాన్‌పై హార్దిక్, కోహ్లీ రికార్డు భాగస్వామ్యం..

31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. దీని తర్వాత హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లి 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను తిరిగి మ్యాచ్‌లో చేర్చారు. ఈ ఇద్దరి భాగస్వామ్యం T20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ వికెట్‌కైనా పాకిస్థాన్‌పై భారత్‌కు అతిపెద్ద భాగస్వామ్యంగా మారింది.

ఇరు జట్లు..

టీమిండియా ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ(సి), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

ఇవి కూడా చదవండి

పాకిస్తాన్ ప్లేయింగ్ XI: బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), షాన్ మసూద్, హైదర్ అలీ, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇఫ్తీకర్ అహ్మద్, ఆసిఫ్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి