T20Iలో IND vs PAK: టీ20 క్రికెట్‌లో 11 సార్లు ఢీకొన్న భారత్-పాకిస్తాన్ టీంలు.. 10 ప్రత్యేక రికార్డులు ఇవే..

PAK vs IND: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ పోరుకు మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. ఇరు జట్లు అక్టోబరు 23న మధ్యాహ్నం 1.30 గంటలకు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో తలపడనున్నాయి.

T20Iలో IND vs PAK: టీ20 క్రికెట్‌లో 11 సార్లు ఢీకొన్న భారత్-పాకిస్తాన్ టీంలు.. 10 ప్రత్యేక రికార్డులు ఇవే..
India Vs Pakisthan
Follow us

|

Updated on: Oct 23, 2022 | 6:05 AM

టీ20 ప్రపంచ కప్ 2022లో అక్టోబర్ 23న భారత్ వర్సెస్ పాకిస్తాన్ (IND vs PAK) మధ్య కీలకపోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల మధ్య 11 మ్యాచ్‌లు జరిగాయి. అందులో భారత్‌దే పైచేయిగా నిలివనుంది. ఈ 11 మ్యాచ్‌ల్లో భారత్ 7 విజయాలు సాధించగా, మూడు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ టీం విజయం సాధించింది. ఇందులో ఒక మ్యాచ్ టై అయింది. ఈ మ్యాచ్‌లకు సంబంధించిన 10 ప్రత్యేక గణాంకాలను ఇప్పుడు చూద్దాం..

1. అత్యధిక పరుగులు: ఇండో-పాక్ టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట నమోదైంది. కోహ్లీ 9 మ్యాచ్‌లు ఆడి 406 పరుగులు చేశాడు.

2. అత్యధిక స్కోరు: ఇండో-పాక్ టీ20 మ్యాచ్‌ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన రికార్డు పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ పేరిట నమోదైంది. గత ప్రపంచకప్‌లో 55 బంతుల్లో 79 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

3. అత్యధిక బ్యాటింగ్ సగటు: ఈ రికార్డు కూడా మహ్మద్ రిజ్వాన్ పేరిట ఉంది. రిజ్వాన్ భారత్‌పై 96.50 సగటుతో స్కోర్ చేశాడు.

4. అత్యధిక సిక్సర్లు: ఈ రికార్డు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరిట నమోదైంది. ఇండో-పాక్ మ్యాచ్‌ల్లో యువరాజ్ 9 సిక్సర్లు కొట్టాడు.

5. అత్యధిక వికెట్లు: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఉమర్ గుల్ ఇక్కడ అగ్రస్థానంలో ఉన్నాడు. 11 వికెట్లు తీశాడు.

6. ఒక మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్: 2007 సెప్టెంబరు 14న జరిగిన భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మొదటి T20 మ్యాచ్‌లో మహ్మద్ ఆసిఫ్ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనగా నిలిచింది.

7. బెస్ట్ ఎకానమీ: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ ఇండో-పాక్ మ్యాచ్‌ల్లో అత్యంత టైట్‌గా బౌలింగ్ చేశాడు. 2 మ్యాచ్‌ల్లో 7 ఓవర్లు వేసి కేవలం 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అంటే, అతని ఎకానమీ రేటు 4.14గా నిలిచింది.

8. అత్యధిక మ్యాచ్‌లు: ఇండో-పాక్‌ల మధ్య అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. అతను 11 మ్యాచ్‌లలో 10 ఆడాడు.

9. అత్యధిక స్కోరు: 28 డిసెంబర్ 2012న, పాకిస్థాన్‌తో జరిగిన T20 మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఇదే అత్యధిక స్కోరుగా నిలిచింది.

10. అత్యల్ప స్కోరు: 27 ఫిబ్రవరి 2016న, పాకిస్తాన్ జట్టు మొత్తం భారత్‌పై కేవలం 83 పరుగులకే ఆలౌట్ అయింది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఇదే అత్యల్ప స్కోరుగా నమోదైంది.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?