T-20 World Cup: కరణ్ ధాటికి బెంబేలెత్తిపోయిన అఫ్గాన్.. ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం..
ప్రపంచకప్‌లో సూపర్-12 రౌండ్ మ్యాచ్‌లు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో గ్రూప్-1 తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 89 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ తర్వాత ఈ గ్రూప్ నుంచి ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్...
ప్రపంచకప్‌లో సూపర్-12 రౌండ్ మ్యాచ్‌లు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో గ్రూప్-1 తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 89 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ తర్వాత ఈ గ్రూప్ నుంచి ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు బౌలర్లు సత్తా చాటారు. దీంతో పరుగులు చేసేందుకు బ్యాట్స్‌మెన్‌లు శ్రమించాల్సి వచ్చింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో అఫ్గాన్ పై విజయం సాధించింది. సుదీర్ఘ గాయం తర్వాత గత నెలలో ఇంగ్లండ్ జట్టులోకి తిరిగి వచ్చిన లెఫ్టార్మ్ మీడియం పేసర్ శామ్ కరన్ రికార్డు బద్దలు కొట్టాడు. అతని స్పెల్ ముందు అఫ్గాన్ బ్యాట్స్‌మెన్స్ నిలబడలేకపోయారు. 3.4 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కరన్ ధాటికి 19.4 ఓవర్లలో 112 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. అఫ్గానిస్థాన్ తరఫున ఇబ్రహీం జద్రాన్ (32), ఉస్మాన్ ఘనీ (30) అత్యధిక పరుగులు చేశారు.
112 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ సునాయసంగా విజయం సాధించేలా కనిపించింది. అయితే, ఇది జరగలేదు. ఆరంభంలో అఫ్గానిస్థాన్ పేసర్లు తమ పగ్గాలను నిలుపుకున్నారు. ఆ తర్వాత రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజీబ్-ఉర్-రహ్మాన్‌ల స్పిన్ త్రయం ఎటాక్ చేయడంతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పరుగుల కోసం కష్టపడ్డారు. కెప్టెన్ బట్లర్ పవర్‌ప్లే ముగిసే లోపే పెవిలియన్‌కు చేరుకున్నాడు. అలెక్స్ హేల్స్, బెన్ స్టోక్స్ కూడా విఫలమయ్యారు. డేవిడ్ మలాన్ చాలా సేపు క్రీజులో నిలిచినా మహ్మద్ నబీ వేసిన అద్భుతమైన క్యాచ్ అతని ఆటను ముగించింది. అటువంటి పరిస్థితిలో, లియామ్ లివింగ్స్టన్ ఒక ఎండ్ పట్టుకొని నెమ్మదిగా జట్టును లక్ష్యానికి తీసుకెళ్లాడు. 113 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లండ్ 19వ ఓవర్ వరకు వేచి చూడాల్సి వచ్చింది.
మరోవైపు.. టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్‌పై ఘోర పరాజయం పాలైంది. 201 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు.. కేవలం 17.1 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 89 పరుగులతో న్యూజిలాండ్ టీం ఘన విజయం సాధించింది.
మరిన్ని టీ-20 వరల్డ్ కప్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి