Video: సూపర్ మ్యాన్ బ్రదరా ఏంది.. గాలిలో తేలుతూ.. కళ్లు చెదిరే క్యాచ్.. వీడియో చూస్తే గూస్‌బంప్సే..
AUS vs NZ Glen Phillips Catch: న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ గాలిలో ఎగురుతూ అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. ఈ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
T20 ప్రపంచ కప్‌లో 13వ, సూపర్ 12 మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 89 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియాకు 201 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. దీనికి సమాధానంగా ఆస్ట్రేలియా జట్టు 111 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వ్ 58 బంతుల్లో 92 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన గ్లెన్ ఫిలిప్స్ గాలిలో ఎగురుతూ ఓ అత్భుతమైన క్యాచ్ పట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఫిలిప్స్ పట్టుకున్న ఈ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సూపర్ మ్యాన్‌లా మారిన గ్లెన్ ఫిలిప్స్..
న్యూజిలాండ్ స్టార్ ఫీల్డర్ గ్లెన్ ఫిలిప్స్ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ క్యాచ్ పట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. 9వ ఓవర్ తొలి బంతికి మిచెల్ స్టానర్ వేసిన బంతిని స్టోయినిస్ భారీ షాట్ ఆడాడు. ఈ బంతి గాలిలో చాలా ఎత్తుకు వెళ్లింది. బంతి గ్లెన్‌కు దూరంగా ఉంది. అయితే సూపర్‌మ్యాన్‌లా గాలిలో దూకి ఈ క్యాచ్‌ను పట్టుకున్నాడు. గ్లెన్ పట్టుకున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్లెన్ ఈ క్యాచ్‌ని అభిమానులు చాలా ఇష్టపడుతున్నారు. గ్లెన్ ఈ క్యాచ్ చూసిన అభిమానులు అతన్ని సూపర్ మ్యాన్ అని పిలుస్తున్నారు.
View this post on Instagram
బౌలింగ్, బ్యాటింగ్‌లో చతికిలపడిన ఆస్ట్రేలియా..
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ముందు తేలిపోయారు. ఇందులో పాట్ కమిన్స్ అత్యంత ఖరీదుగా తేలాడు0. 4 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చాడు. ఇది కాకుండా ఆడమ్ జంపా 4 ఓవర్లలో 39 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. అదే సమయంలో మార్కస్ స్టోయినిస్ 4 ఓవర్లలో 38 పరుగులు, మిచెల్ స్టార్క్ 4 ఓవర్లలో 36 పరుగులు చేశారు. జోష్ హాజిల్‌వుడ్ కూడా 4 ఓవర్లలో 41 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగలిగాడు.