- Telugu News Photo Gallery Cricket photos Arshdeep singh to naseem shah check these 4 debutant players in t20 world cup 2022 camroon green
T20 World Cup 2022: తొలి ప్రపంచకప్ ఆడనున్న యువ ఆటగాళ్లు వీరే.. లిస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్..
టీ20 ప్రపంచకప్ 2022 సూపర్-12 రౌండ్ మ్యాచ్‌లు శనివారం నుంచి మొదలయ్యాయి. ఈ రౌండ్‌లో చాలా మంది యువ ఆటగాళ్ళు తమ మొదటి ప్రపంచ కప్ ఆడేందుకు సిద్ధమయ్యారు.
Updated on: Oct 22, 2022 | 6:15 PM

టీ20 వరల్డ్ కప్ 2022 సూపర్-12 రౌండ్ మ్యాచ్‌లు శనివారం నుంచి జరుగుతున్నాయి. టీ20 ప్రపంచకప్ 2022 సూపర్-12 రౌండ్‌లో తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడుతోంది. అదే సమయంలో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత జట్టు తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ అక్టోబర్ 23న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. అయితే, ఈ ప్రపంచకప్‌లో కొంతమంది యువ ఆటగాళ్లు తొలిసారి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. అలాంటి నలుగురు ఆటగాళ్లను ఇప్పుడు చూద్దాం..

కెమరూన్ గ్రీన్ (ఆస్ట్రేలియా).. భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌లో కెమెరూన్ గ్రీన్ బాగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ ఆల్ రౌండర్ వరల్డ్ కప్ లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. వాస్తవానికి, జోస్ ఇంగ్లీష్ గాయం కారణంగా ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించాడు. ఇటువంటి పరిస్థితిలో కామెరాన్ గ్రీన్ ఆట ఫిక్స్ అయినట్లు నమ్ముతారు. బ్యాటింగ్‌తో పాటు, కెమెరాన్ గ్రీన్ తన అద్భుతమైన బౌలింగ్‌కు పేరుగాంచాడు. మొహాలీలో భారత్‌పై కామెరాన్ గ్రీన్ 30 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ప్రపంచ కప్‌లో ఈ ఆల్ రౌండర్ గొప్ప ప్రదర్శనతో ఆకట్టుకోనున్నట్లు భావిస్తు్న్నారు.

నసీమ్ షా (పాకిస్థాన్).. ఆసియా కప్ 2022లో, పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా తన వేగంతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. నసీమ్ షా కెరీర్ గురించి మాట్లాడితే, ఈ ఆటగాడు ఇప్పటివరకు 9 టీ20 మ్యాచ్‌లలో 11 వికెట్లు పడగొట్టాడు. ఈ ఫార్మాట్‌లో 7 పరుగులకు 2 వికెట్లు పడగొట్టడం నసీమ్ షా అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్‌గా నిలిచింది. ఎకానమీ రేటు 7.89గా ఉంది. ఇప్పుడు ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ఈ 19 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. అయితే ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్స్‌కు షాహీన్ అఫ్రిది, నసీమ్ షా పెద్ద సవాల్‌గా నిలవనున్నారు.

ఫిన్ అలెన్ (న్యూజిలాండ్).. న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఫిన్ అలెన్ తన పేలుడు బ్యాటింగ్‌తో విభిన్నమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫిల్ అలెన్ ఇటీవలి ఫామ్ కూడా అద్భుతంగా ఉంది. అదే సమయంలో, ఫిన్ అలెన్ టీ20 కెరీర్‌ను పరిశీలిస్తే, ఈ ఆటగాడు ఇప్పటివరకు 18 మ్యాచ్‌ల్లో 469 పరుగులు చేశాడు. ఈ సమయంలో, ఫిన్ అలెన్ సగటు 26.05గా ఉంది. అదే సమయంలో అత్యుత్తమ స్కోరు 101 పరుగులు. ఇది కాకుండా, ఫిన్ అలెన్ ఈ ఫార్మాట్‌లో ఇప్పటివరకు రెండుసార్లు యాభై పరుగుల మార్క్‌ను అధిగమించాడు. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ పేరిట 1 సెంచరీ నమోదైంది.

అర్ష్‌దీప్ సింగ్ (భారతదేశం).. భారత జట్టు ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ 2018 సంవత్సరంలో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన టీమ్ ఇండియాలో భాగమయ్యాడు. ఈ ఆటగాడు ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా టీమిండియాలో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అదే సమయంలో ఈ ఆటగాడి ప్రదర్శన భారత జట్టుకు కూడా అద్భుతంగా ఉంది. అర్ష్‌దీప్ సింగ్ టీ20 కెరీర్‌ను పరిశీలిస్తే.. ఈ ఆటగాడు ఇప్పటి వరకు 13 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అర్ష్‌దీప్ సింగ్ 13 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీశాడు. కాగా, అర్ష్‌దీప్ సింగ్ 12 పరుగులకు 3 వికెట్లు పడగొట్టడం అత్యుత్తమ బౌలింగ్‌గా నిలిచింది. ఇది కాకుండా, అర్ష్‌దీప్ సింగ్ ఎనకానీ రేటు 8.14గా ఉంది.





























