- Telugu News Photo Gallery Cricket photos Top 5 batters in india vs pakistan t20 world cup 2022 matches virat kohli 1st place
IND vs PAK: ఇండో-పాక్ టీ20 మ్యాచ్‌లలో టాప్ స్కోరర్ ఎవరో తెలుసా? టాప్-5లో ఉన్నది వీరే..
భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇప్పటివరకు 11 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో అత్యధిక పరుగులు విరాట్ కోహ్లీ చేసినవే కావడం గమనార్హం.
Updated on: Oct 23, 2022 | 9:56 AM

IND vs PAK T20 Records: భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇప్పటివరకు 11 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో అత్యధిక పరుగులు విరాట్ కోహ్లీ చేసినవే కావడం గమనార్హం.

ఇండో-పాక్ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. 9 మ్యాచ్‌ల్లో 406 పరుగులు చేశాడు. ఈ సమయంలో విరాట్ బ్యాటింగ్ సగటు 67.66, స్ట్రైక్ రేట్ 119.06గా నిలిచింది. పాకిస్థాన్‌పై విరాట్ 4 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.

ఇండో-పాక్ టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు మహ్మద్ రిజ్వాన్. రిజ్వాన్ మూడు మ్యాచ్‌ల్లో 193 పరుగులు చేశాడు. భారత్‌పై రిజ్వాన్ బ్యాటింగ్ సగటు 96.50, స్ట్రైక్ రేట్ 130.40గా ఉంది.

పాకిస్థాన్ వెటరన్ ప్లేయర్ షోయబ్ మాలిక్ ఇక్కడ మూడో స్థానంలో ఉన్నాడు. షోయబ్ భారత్‌తో ఆడిన 9 మ్యాచ్‌లలో 27.33 బ్యాటింగ్ సగటు, 103.79 స్ట్రైక్ రేట్‌తో 164 పరుగులు చేశాడు. ఆసియా కప్ 2022కి ముందు షోయబ్ మాలిక్ ఇండో-పాక్‌ల ప్రతి మ్యాచ్‌లో భాగమయ్యాడు.

ఇండో-పాక్ టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బౌలర్లలో మహ్మద్ హఫీజ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. హఫీజ్ 8 మ్యాచ్‌లలో 26 బ్యాటింగ్ సగటు, 118.18 స్ట్రైక్ రేట్‌తో 156 పరుగులు చేశాడు.

టాప్-5లో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా ఉన్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన 8 టీ20 మ్యాచ్‌ల్లో యువరాజ్ 25.83 బ్యాటింగ్ సగటు, 109.92 స్ట్రైక్ రేట్‌తో 155 పరుగులు చేశాడు. ఇండో-పాక్ మ్యాచ్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ కూడా యువరాజ్. అతను 9 సిక్సర్లు కొట్టాడు.




