AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2022: పాకిస్తాన్‌తో పోరుకు సిద్ధమైన టీమిండియా.. బరిలోకి దిగే 11 మంది వీరే?

India Playing XI vs Pakistan: భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లు, వార్మప్ మ్యాచ్‌లలో ఆటగాళ్ల పనితీరును క్షుణ్ణంగా పరీక్షించింది. దీంతో అసలు పోరులో దిగే 11 మందిపై కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు హెడ్ కోచ్ ద్రవిడ్ ఓ అవగాహన వచ్చింది.

T20 World Cup 2022: పాకిస్తాన్‌తో పోరుకు సిద్ధమైన టీమిండియా.. బరిలోకి దిగే 11 మంది వీరే?
India Vs Pakisthan
Venkata Chari
|

Updated on: Oct 20, 2022 | 3:45 PM

Share

2007 తర్వాత భారత జట్టు మరో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలవలేదు. ఈసారి ఈ ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరుగుతుండగా, రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా విజయం కోసం బలమైన పోటీదారులలో ఒకటిగా నిలిచింది. ఇందుకోసం టీమ్ ఇండియా సిద్ధమై అత్యుత్తమ ఆటగాళ్లతో అస్ట్రేలియా చేరుకుంది. దీంతో టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దేగే 11 మంది ఆటగాళ్లు ఎవరో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎన్నో ఊహాగానాల మధ్య ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ప్లేయింగ్-11 ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.

ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత, టీమ్ ఇండియా వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడింది. ఒకటి గెలిచింది. మరొకదాంట్లో ఓటమిని సాధించింది. ఆ తర్వాత ఆ జట్టు రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా.. ఆతిథ్య ఆస్ట్రేలియాతో ఆడిన మొదటి మ్యాచ్‌లో విజయం సాధించగా, న్యూజిలాండ్‌తో జరగాల్సిన రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.

బ్యాటింగ్ ఆర్డర్ ఫిక్స్..!

ఇక టీమ్ ఇండియా బ్యాటింగ్ విషయానికొస్తే.. ఎవరు ఎక్కడ ఆడతారనే విషయంపై ఓ క్లారిటీ వచ్చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. రోహిత్ ఫామ్ టీమ్ ఇండియాకు ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన టోర్నీలో మళ్లీ పుంజుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ నంబర్-3లో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా నంబర్-4లో ఫిక్స్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో బరిలోకి దిగనుండగా, దినేష్ కార్తీక్ తర్వాతి స్థానంలో రానున్నాడు. ఇద్దరూ ఫినిషర్స్ పాత్రలో ఉంటారు. ఈఇద్దరిపై టీమిండియా ఎంతో ఆధారపడి ఉంది.

ఆ తర్వాతే అసలు కథ మొదలు..

ఆ తర్వాతే పజిల్స్ మొదలవుతున్నాయి. టీమ్ ఇండియా ఇద్దరు స్పిన్నర్లతో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో వెళుతుందా లేదా ఇద్దరు స్పిన్నర్లకు బదులుగా ఒక బ్యాట్స్‌మెన్‌కు అవకాశం ఇవ్వాలనుకుంటుందా అనేది మొదటి ప్రశ్నగా నిలిచింది. మొదటి పరిస్థితిలో పాండ్యా కూడా ఉన్నందున ఆరు బౌలింగ్ ఎంపికలు ఉంటాయి. కానీ, రెండవ స్థానంలో అది సాధ్యం కాదు. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని టీమిండియా నిర్ణయించుకుంటే అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లలో ఒకరు రానున్నారు. అయితే వీరిద్దరూ బ్యాటింగ్ చేయగలగడం భారత్‌కు కలిసొచ్చే అంశం.

ప్రధాన స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్..

యుజ్వేంద్ర చాహల్ ప్రధాన స్పిన్నర్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇద్దరు స్పిన్నర్లతో వెళ్లడం భారతదేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా మైదానాలు పెద్దవిగా ఉంటాయి. బ్యాట్స్‌మెన్ స్పిన్నర్లపై దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తుంటారు. కాబట్టి వికెట్లు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ముగ్గురు ఫాస్ట్ బౌలర్లలో ఎవరికి ఛాన్స్?

జస్ప్రీత్ బుమ్రా లేడు. అతని స్థానంలో మహమ్మద్ షమీ వచ్చాడు. షమీ మొదటి వార్మప్ మ్యాచ్‌లో ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. ప్లేయింగ్-11 కోసం తన వాదనను బలంగా వినిపించాడు. అతనితో పాటు, అర్ష్‌దీప్ సింగ్ ఆట ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ మధ్యే అసలు పోరు నడుస్తోంది. సీనియారిటీ గురించి ఆలోచిస్తే భువనేశ్వర్ బరిలోకి దిగే ఛాన్సుంది.

టీమ్ ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్-11..

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.